430 కిలోల బంగారం.. 12 లక్షల కొత్త నోట్లు!

430 కిలోల బంగారం.. 12 లక్షల కొత్త నోట్లు! - Sakshi

పెద్దనోట్ల రద్దు తర్వాత రెవెన్యూ, ఐటీ శాఖ అధికారులు ఇప్పటివరకు చేసిన దాడులన్నింటిలోకీ అతి పెద్ద దాడి తాజాగా ఢిల్లీ, నోయిడాలలో జరిగింది. ఈ దాడిలో ఏకంగా రూ. 120 కోట్ల విలువైన 430 కిలోల బంగారం.. 2.48 కోట్ల పాతనపోట్లు, రూ. 12 లక్షల కొత్తనోట్లు, 80 కిలోల వెండి, 15 కిలోల బంగారు ఆభరణాలు.. ఇలా ఇంకా చాలా పట్టుకున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌లోని లక్నో విభాగానికి చెందిన అధికారులు ఈ దాడులు చేశారు. శ్రీ లాల్ మహల్ లిమిటెడ్ అనే కమోడిటీస్ ట్రేడింగ్ కంపెనీ యజమానుల కార్యాలయాలు, ఇళ్లపై ఏక కాలంలో ఈ దాడులు జరిగాయి. ప్రత్యేక ఆర్థిక నిబంధనల ప్రకారం డ్యూటీ ఫ్రీ పద్ధతిలో దిగుమతి చేసుకున్న బంగారాన్ని అక్రమంగా తరలించి ఇంత మొత్తం కూడబెట్టారు. 

 

దాంతోపాటు.. ఇవే కార్యాలయాల్లో నడుస్తున్న మరో కంపెనీకి ఇక్కడి నుంచి పెద్దమొత్తంలో నగదును ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేసినట్లు కూడా అధికారులు గుర్తించారు. పెద్దనోట్లను రద్దు చేసిన తర్వాత ఒక కంపెనీ అకౌంటులో డబ్బులు వేసుకుని, మరో కంపెనీకి ట్రాన్స్‌ఫర్ చేయడం లాంటి అక్రమాలను గుర్తించారు. ఈ మొత్తంతోనే బంగారు నాణేలు లేదా కడ్డీలను ప్రభుత్వం రంగ సంస్థ అయిన మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ నుంచి కొనుగోలు చేశారు. ఈ బంగారాన్ని ఆ సంస్థ ప్రతినిధులు బహిరంగ మార్కెట్లో అమ్మకానికి సిద్ధం చేశారని, అదికూడా పాతనోట్లలో ఎక్కువ విలువకు అమ్ముతున్నారని తెలిపారు. తమకు ఆరోగ్యం బాగోలేదన్న కారణం చూపించి అధికారుల ప్రశ్నలకు కంపెనీ డైరెక్టర్లు సమాధానం ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top