రాజకీయ అవినీతికి జర్నలిస్టుల బలి

రాజకీయ అవినీతికి జర్నలిస్టుల బలి - Sakshi


భోపాల్: దేశంలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్న వివిధ కుంభకోణాలు, వివిధ రంగాల్లో చోటుచేసుకుంటున్న అవినీతిని వెలుగులోకి తీసుకరావడానికి కృషి చేస్తున్న జర్నలిస్టుల ప్రాణాలకు నేడు భద్రత లేకుండా పోయింది. 2013లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యాపం (మధ్యప్రదేశ్ వ్యావసాయక్ పరీక్షా మండల్) కుంభకోణం కేసులో దర్యాప్తునకు వెళ్లిన ఆజ్‌తక్ రిపోర్టర్ అక్ష య్ సింగ్ శనివారం నాడు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన విషయం తెల్సిందే. మొన్నటికి మొన్న భూ ఆక్రమణలు, అక్రమ మైనింగ్ కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన ఉత్తరప్రదేశ్ ఫ్రీలాన్స్ జర్నలిస్టు జగేందర్ సింగ్‌ను సజీవంగా దహనం చేసిన సంఘట క్రమంలోనే భారత్‌లో రాజకీయ అవినీతికి మరో జర్నలిస్టు బలయ్యారు.



 జర్నలిస్టుల భద్రత కోసం ఏర్పాటైన కమిటీ లెక్కల ప్రకారం 1992 నుంచి ఇప్పటి వరకు 35 మంది జర్నలిస్టులు తమ విధి నిర్వహణలో మృత్యువాత పడ్డారు. వారిలో 43 శాతం మంది రాజకీయ నాయకులకు సంబంధంవున్న అవినీతి కేసులను పరిశోధిస్తున్నవారుకాగా, 31 శాతం మంది బడా వ్యాపారస్థుల అవినీతి కేసులను పరిశోధిస్తున్నవారే కావడం గమనార్హం. దేశంలో ఎమర్జెన్సీ కాలం నాటి నుంచి ఎంతో మంది జర్నలిస్టులు విధి నిర్వహణలో ప్రాణాలు పోతున్నా వారి భద్రతకు కమిటీలు వేయడం తప్పా పటిష్టమైన చర్యలు ఏ ప్రభుత్వమూ తీసుకోలేదు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top