మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి


బెంగళూరు: బెంగళూరులో మరో దారుణం జరిగింది. మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  పాప  బాధతో విలవిల్లాడుతోంటే అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఆరా తీశారు.  చిన్నారిపై లైంగిక దాడి జరిగిన విషయాన్నికనుగొన్నారు. బెంగళూరుకు చెందిన ఇందిరానగర్ పాఠశాలలో ఈ దారుణం జరిగింది.



 వెంటనే చిన్నారి తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు.  కేసు నమోదు చేసిన పోలీసులు చిన్నారిని  వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాలలపై లైంగికదాడి నియంత్రణ చట్టం ( ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఎబ్యూజ్  అఫెన్స్స్ యాక్ట్) కింది నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.  నిందితులను గుర్తించాల్సి వుందన్నారు.



అయితే ఈ ఆరోపణలను  స్కూలు యాజమాన్యం తిరస్కరించింది.  పాప  కేవలం మూడుగంటలు మాత్రమే తరగతి గదిలో ఉందని,  ఆ తర్వాత ఆమెను తండ్రి ఇంటికి తీసుకు వెళ్ళినట్టు చెబుతోంది.  సీసీ టీవీని పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుందని  స్కూలు సెక్రటరీ చెబుతున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top