డాన్సింగ్ గర్ల్స్తో పిచ్చిగంతులేసిన ఎమ్మెల్యే

డాన్సింగ్ గర్ల్స్తో పిచ్చిగంతులేసిన ఎమ్మెల్యే


పాట్నా: బిహార్ లో జేడీయూ ఎమ్మెల్యే శ్యాం బహదూర్ సింగ్ డ్యాన్సింగ్ గర్ల్స్తో దుమ్మురేపాడు. యువకులు కూడా అవాక్యయ్యే రేంజ్లో అదిరిపోయే స్టెప్పులేశాడు. అయితే, అదేదో పద్ధతిగా అయితే బాగుండేది.. కానీ పూర్తిగా అభ్యంతరకరమైన పరిస్థితుల్లో.. అసభ్యకర చేష్టలతో.. 2015లో చోటుచేసుకున్న ఈ వీడియో ఇప్పుడు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోంది. సాధారణంగా తిరునాళ్లలో, జాతరల్లో నిర్వహించే అభ్యంతరకర నృత్యాలు దాదాపుగా బ్యాన్ అయిన విషయం తెలిసిందే.



ఒక వేళ అలా ఎవరైనా నిర్వహించి అది కాస్త తన కళ్లపడినప్పుడు వెళ్లి మందాలించాల్సిన ప్రజాప్రతినిధి ఏకంగా తన ముందే ఆ కార్యక్రమం నిర్వహిస్తుంటే వారితో కలిసి చిందులేయాలని ఉటలాటపడ్డారు. అనుకుందే తడువుగా కొంత అశ్లీలంగా కనిపించే రీతిలో స్టెప్పులేశారు. తప్పుడు విధంగా సంకేతాలు ఇస్తూ స్టెప్పులేశారు. ఈ డ్యాన్స్ చూస్తుంటే ఆ ఎమ్మెల్యే పూర్తిగా మద్యం మత్తులో ఉన్నారే అనే అనుమానం కలగక మానదు. బిహార్ లో ఇప్పటికే మద్యం నిషేధం విధించిన నేపథ్యంలో సీఎం నితీశ్ కుమార్ చర్యలు తీసుకునే అవకాశాలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top