ఏకధాటిగా 14 గంటలు...
సినీ తారల జీవితాలు చూడటానికి పైకి అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ వాళ్లు పడుతున్న స్ట్రెస్, స్ట్రగుల్ పైకి చెప్పుకోలేరు. ఒక్కోసారి కొన్ని గంటల పాటు పగలు, రాత్రి అనే తేడా లేకుండా పనిచేయాల్సి ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్‌తో వచ్చిన వాళ్లకు, లేకుండా వచ్చిన వాళ్లకు పని విషయంలో ఎలాంటి తేడా ఉండదు. ఎలాంటి టైం లోనైనా పనిచేయాల్సిందే. ఆ విషయంలో ఎలాంటి ఎక్స్క్యూజ్లు ఉండవు. సరిగ్గా బాలీవుడ్ కథానాయిక శ్రద్ధాకపూర్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది.
తాజాగా ఆమె టైగర్‌ష్రాఫ్ సరసన కథానాయికగా ‘బాగీ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. కొన్ని రోజల క్రితం ఈ సినిమా షూటింగ్‌ను కేరళలో పూర్తి చేసుకుని ముంబై వచ్చిన శ్రద్ధ వెంటనే ఓ యాడ్ షూటింగ్ నిమిత్తం రొమానియా కంట్రీ ఫ్లయిట్ ఎక్కేశారు. రెండు రోజులే షూటింగ్ షెడ్యూల్. ఇక ఏమాత్రం రెస్ట్ తీసుకోకుండా ఏకధాటిగా 14 గంటల పాటు చిత్రీకరణలో పాల్గొన్నారామె. ఎంత పారితోషికం ఇచ్చినా కూడా ఇంత కష్టపడటమంటే మాటలు కాదు. శ్రద్ధ ఓపికను మెచ్చుకోవాల్సిందే!