ఆ నటి చెంప మూడుసార్లు చెళ్లుమంది

ఆ నటి చెంప మూడుసార్లు చెళ్లుమంది - Sakshi


న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ చెంపను మూడుసార్లు చెడమడా చెళ్లుమనిపించాడు ఓ వ్యక్తి. అందుకు మరి విద్యాబాలన్ ఏమనలేదని అనుకుంటున్నారా.. మీ అనుమానం కరెక్టే..కానీ ఆమె మాత్రం ఏమీ అనలేదు. ఎందుకంటే అది నిజంగా కాదు కాబట్టి. 'హమారీ అదూరీ కహానీ' అనే చిత్రంలో ఓ సన్నివేశం కోసం విద్యాబాలన్ చెంపపై హీరోగా నటిస్తున్న రాజ్ కుమార్ రావ్ మూడుసార్లు కొట్టాడు.



సీన్ వాస్తవాన్ని తలపించేలా ఉండేందుకే ఇలా మూడుసార్లు విద్యా చెంపమీద డైరెక్టర్ కొట్టించారట. ఈ విషయాన్ని రాజ్ కుమార్ రావ్ చెప్పాడు. ఈ చిత్రంలో విద్యాబాలన్, రాజ్ కుమార్ రావ్ భార్య భర్తలుగా నటిస్తున్నారు. గృహహింస ఎంత భయంకరంగా ఉంటుందో చూపించడానికి ఈ సన్నివేశం తీశారు. ఈ చిత్రం జూన్ పన్నెండున విడుదల కానుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top