మమ్మల్ని కలపడం ఎవరి వల్లా కాలేదు!


త్రిష, నయనతార ఒకప్పుడు బద్ధ శత్రువులనే టాక్ ఉండేది. ఒకరి సినిమాలు మరొకరు దక్కించుకోవడానికి ట్రై చేసేవారని, విపరీతంగా పోటీపడేవాళ్లని కూడా చెప్పుకునేవారు. వీళ్లిద్దరూ బహిరంగంగా మాటా మాటా అనుకోకపోయినా, తమ సన్నిహితుల దగ్గర మాత్రం ఒకరి గురించి మరొకరు నోరు పారేసుకునేవారట.

 

 ఇక, జన్మలో ఈ ఇద్దరూ స్నేహంగా మెలిగే ప్రసక్తే లేదని పరిశీలకులు భావించిన తరుణంలో ఈ ముద్దుగుమ్మలు అందరికీ ఓ షాకిచ్చారు. హఠాత్తుగా ఇద్దరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. పొడి పొడి మాటలతో మొదలైన వీళ్ల స్నేహం ఇప్పుడు ముదిరి పాకాన పడింది. ఇద్దరూ కలిసి పార్టీలు చేసుకునే స్థాయికి ఫ్రెండ్స్ అయిపోయారు. త్రిష అయితే ఏకంగా నయనతార కాంబినేషన్లో సినిమా చేయాలనుకుంటున్నారు.

 

 ఇద్దరు నాయికలున్న సినిమాకి అవకాశం వస్తే, ఆ కథలో ఇంకో నాయికగా మీకు ఎవరైతే బాగుంటుంది? అనే ప్రశ్న త్రిష ముందుంచితే... ‘నయనతార’ పేరు చెప్పారామె. తామిద్దరం మంచి స్నేహితులమనీ, తమ ఇద్దర్నీ కలిపి సినిమా తీయడానికి చాలా మంది ప్రయత్నించినా కుదరలేదనీ త్రిష పేర్కొన్నారు. మరి.. ఈ దోస్తుల కలయికలో ఎవరు సినిమా చేస్తారో చూడాలి.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top