కొచ్చాడయాన్‌ ఎందుకు ఆడలేదంటే..

కొచ్చాడయాన్‌ ఎందుకు ఆడలేదంటే..


తమిళసినిమా: కోలీవుడ్‌లో తండ్రి బాటలో పయనిస్తున్న అతి కొద్ది మంది తనయురాళ్లలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కూతుర్లు ఐశ్వర్య ధనుష్, సౌందర్య రజనీకాంత్‌ ఒకరు. వీరిద్దరూ తండ్రి చాటు పిల్లలుగా కాకుండా తమ కంటూ ప్రత్యేక గు ర్తింపును పొందుతూ స్వతంత్రంగా సినీరంగంలో ఎదుగుతున్నారు.



రజనీకాంత్‌ పెద్ద కూతురు తన భర్త ధనుష్‌ కథానాయకుడుగా 3 చిత్రం చేసి ప్రాచుర్యం పొందారు. ఆ చి త్రంలోని వై దిస్‌ కొలై వెరి డీ పాట ప్రపంచ సినీ ప్రేక్షకులనే మైమరపించింది.ఇక రెండవ కూతురు సౌందర్య ఏకంగా తన తండ్రినే కథానాయకుడిగా ఎంచుకుని కొచ్చాడయాన్‌ అనే క్యాప్చరింగ్‌ మోషన్‌ యానిమేషన్‌ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ మహిళా దర్శకురాలు తన బావ ధనుష్‌ కథా నాయకుడిగా వీఐపీ–2 చిత్రాన్ని తె రకెక్కించారు.



నటుడు ధనుష్‌ కథ, మాటలు అందించడంతో పాటు వి.క్రియేషన్స్‌ అధినేత కలైపులి ఎస్‌.థానుతో కలిసి నిర్మిస్తుండడం విశేషం. ఇందులో బాలీవుడ్‌ క్రేజీ నటి కాజోల్‌ ముఖ్య భూమికను పోషించడం మరో విశేషం. అమలాపాల్‌ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి షాన్‌రోల్డన్‌ సంగీత బాణీలను అందించారు. తమిళంతో పా టు,తెలుగు,హిందీభాషల్లోనూ తెరకెక్కిన వీఐపీ–2 చిత్ర నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 28న మూడు భాషల్లోనూ ఏక కా లంలో విడుదలకు ముస్తాబవుతోం ది. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం చిత్ర దర్శకురాలు విలేకరులతో ముచ్చటించారు.



ప్ర:  వీఐపీ 2 చిత్రం గురించి?

జ: వీఐపీ 2 చిత్రం చేయడం మంచి అనుభవం. ఇందులోని నటీనటులు, సాంకేతిక వర్గం నుంచి నేను చాలా నేర్చుకున్నాను.



ప్ర:  ఇందులో ప్రధాన పాత్రకు బాలీవుడ్‌ నటి కాజోల్‌నే ఎంచుకోవడానికి కారణం?

జ:  ధనుష్‌ ఈ కథను తయారు చేసినప్పుడే ఇందులోని వసుంధర పాత్రకు కాజోల్‌ అయితే బాగుం టుందని భావించాం. తమ అభిప్రాయాన్ని నిర్మాత కలైపులి.ఎస్‌ థానుకు చెప్పగా ఆయన చాలా పాజిటీవ్‌గా స్పందించారు. ఆ తరువాత ఒక రోజు ధనుష్‌ ఫోన్‌ చేసి కాజోల్‌ ఓకే అన్నారు అని చెప్పారు. దీంతో వీఐపీ–2 చిత్రానికి మరింత హైప్‌ వచ్చేసింది



ప్ర: కాజోల్‌ చిత్రంలో ప్రతినాయకిగా నటిస్తున్నారనే ప్రచారం గురించి?

జ: నిజం చెప్పాలంటే కాజోల్‌ది ప్రతినాయకి పాత్ర కాదు. చిత్రంలో రఘువరన్‌ పాత్రకు వసుంధర పాత్రకు మధ్య క్లాష్‌ నడుస్తుంది. ఆ మె స్టైలిష్‌ నటన చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చిందనే చెప్పాలి.



ప్ర: పడయప్పా చిత్రంలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్ర తరహాలో ఉంటుందా ఇందులో కాజోల్‌ పాత్ర?

జ: ఆ పాత్రకు పోల్చడం సరి కాదు. అయితే కాజోల్‌ పాత్ర వేరే విధంగా ఉంటుంది. తను చాలా కాన్ఫిడెంట్‌గా నటించారు. సాధారణంగా తెలియని భాషలో నటించడం చాలా కష్టం. అయితే తాను ఆంగ్లంలో చెప్పిన సంభాషణలను కాజోల్‌ చక్కగా అవగాహన చేసుకుని నటించారు.



ప్ర: వీఐపీ 2 చిత్రాన్ని రజనీకాంత్‌ చూశారా?

జ: ఇంకా చూడలేదు. చిత్రం ప్రస్తుతం సెన్సార్‌ కార్యక్రమాలను జరుపుకుంటోంది.



ప్ర: మీ తండ్రి రజనీకాంత్‌ కథానాయకుడిగా మళ్లీ చిత్రం చేస్తారా?

జ: అలాంటి అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను



ప్ర: కొచ్చాడయాన్‌ చిత్రం ప్రేక్షకాదరణ పొందకపోవడానికి కారణం ఏమిటంటారు?

జ: అప్పట్లో యానిమేషన్‌ గురించి ప్రేక్షకులకు సరిగా అర్థం కాకపోవడమే. నాన్నను అభిమానులు లైవ్‌గా చూడాలని కోరుకుంటారు. యానిమేషన్‌ చిత్రం కావడంతో వారికి అర్థం కాలేదు. అయితే ఆ చిత్ర ప్రత్యేకత దానిదే.



ప్ర: మీ తండ్రి రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రావాలన్న కోరికను నటుడు కమలహాసన్‌ కూతురు శ్రుతీహాసన్‌ వ్యక్తం చేశారు. అదే విధంగా కమలహాసన్‌ మీ తండ్రి రాజకీయ రంగప్రవేశం గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీని గురించి మీ అభిప్రాయం?

జ: కమల్‌ అంకుల్‌ అభిప్రాయాలు చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. అవి అర్థవంతంగా ఉంటాయి కూడా. నాన్న, కమల్‌ అంకుల్‌ చిరకాల మిత్రులు. వారిద్దరూ బాగుండాలి.



ప్ర: మీ సోదరి ఐశ్వర్య, మీరు ఇద్దరూ దర్శకత్వంపైనే దృష్టి పెట్టారు. నటనపై మొగ్గు చూపకపోవడానికి కారణం?

జ: ఎమో అలాంటి ఆలోచన రాలే దు. నేను మొదట గ్రాఫిక్స్, యాని మేషన్‌ నేర్చుకున్నాను. ఆ తరువా త దర్శకత్వంపై దృష్టిసారించాను.



ప్ర: ఇప్పడు నటించే అవకాశం ఉందా?

జ: అలాంటి అవకాశం వస్తే కచ్చితంగా నటిస్తా. ఎలాంటి పాత్రఅన్నది వచ్చే అవకాశాలను బట్టి ఉంటుంది.



ప్ర: కొత్త తరహాలో చిత్రాలు చేయాలని కోరుకుంటున్నారా?

జ: హారీపోటర్‌ చిత్రం తరహాలో దక్షిణా చిత్రాలు రాలేదు. బాలల ఇతివృత్తంతో అలాంటి చిత్రం చేయాలనుంది. కచ్చితంగా చేస్తాను.



ప్ర: అందులో మీ అబ్బాయి వేద్‌ నటించే అవకాశం ఉందా?

జ: తప్పకుండా ఉంది



ప్ర:  తెలుగులో దర్శకత్వం వహిస్తారా?

జ: అవకాశం వస్తే కచ్చితంగా చేస్తా. అక్కడ చాలా మంది ఫ్రెండ్స్‌ ఉన్నారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top