అందుకే నిర్మాతగా మారాను :‘మధుర’ శ్రీధర్

అందుకే నిర్మాతగా మారాను :‘మధుర’ శ్రీధర్


‘‘హిందీ రంగంలో సంజయ్ లీలా భన్సాలీ, ఆదిత్య చోప్రా, కరణ్ జోహార్ తదితరులు దర్శకులుగా కొనసాగుతూనే ఇతర దర్శకులతో సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. వారి బాటలో మనం ఎందుకు వెళ్లకూడదు అనిపించింది. అందుకే నిర్మాతగా మారాను’’ అని ‘మధుర’ శ్రీధర్ చెప్పారు. నీలకంఠ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘మాయ’ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ‘మధుర’ శ్రీధర్ మాట్లాడుతూ -‘‘నా దర్శకత్వంలో రూపొందిన ‘స్నేహ గీతం’ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ, ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ మాత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేదు.

 

 మంచి కథ కుదిరితేనే దర్శకునిగా చేయాలనుకున్నాను. ఈ నేపథ్యంలో నీలకంఠ చెప్పిన ‘మాయ’ కథ నచ్చి, నిర్మించాను. ప్రేక్షకుల అంచనాలకు అందకుండా ఉత్కంఠభరితంగా ఈ చిత్రం స్క్రీన్‌ప్లే ఉంటుంది. రషెస్ చూడక ముందు ఏ, బి సెంటర్స్‌కే పరిమితం అవుతుందన్నవారు, సినిమా చూసిన తర్వాత ‘సి’ సెంటర్స్‌లో కూడా ఆడుతుందన్నారు. ఎమ్మెస్ రాజు, విజయేంద్రప్రసాద్, బోయపాటి శ్రీను రషెస్ చూసి, ‘తెలుగు సినిమాకి మంచి రోజులొస్తున్నాయి’ అన్నారు. అతీంద్రయ దృష్టి నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. క్రికెటర్ శ్రీశాంత్ స్ఫూర్తితో ‘సచిన్’, హిందీలో ఘనవిజయం సాధించిన ‘విక్కీ డోనర్’ ఆధారంగా ‘దానకర్ణ’ చిత్రాలు చేయబోతున్నాన’’ని ఆయన తెలిపారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top