మరోసారి దేవుడి పాత్రలో..?

మరోసారి దేవుడి పాత్రలో..? - Sakshi


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి దేవుడి పాత్రలో కనిపించనున్నాడట. ఇప్పటికే గోపాల గోపాల సినిమాలో మోడ్రన్ కృష్ణుడిగా ఆకట్టుకున్న పవన్. ఈ సారి త్రివిక్రమ్ సినిమాలో దేవుడి పాత్రలో నటించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. అ..ఆ.. సినిమాతో సూపర్ హిట్ కొట్టిన త్రివిక్రమ్, ప్రస్తుతం పవన్తో చేయబోయే సినిమా కోసం స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టాడు. ఈ సినిమాకు 'దేవుడే దిగివచ్చినా' అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట.



కథా కథనాలు ఎంటో చెప్పకపోయినా టైటిల్ను బట్టి ఈ సినిమాలో పవన్ దేవుడి పాత్రలో కనిపిస్తాడని భావిస్తున్నారు. గతంలో ఖలేజా సినిమాలో మహేష్ బాబును దేవుడిగా చూపించిన త్రివిక్రమ్, ఈ సారి పవర్ స్టార్ను అదే తరహాలో చూపించే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న పవన్ డిసెంబర్ నుంచి త్రివిక్రమ్ సినిమా షూటింగ్లో పాల్గొననున్నాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top