శునక ప్రేమ


నటి త్రిష ఎప్పుడూ ఏదో విధంగా ప్రచారంలో ఉంటుంటారు. మూడు పదుల వయసుకు చేరువవుతున్నా ఏ మాత్రం వన్నె తరగని అందాలతో కథా నాయకిగా కొనసాగుతున్న త్రిషకు మూగ జీవాలంటే ప్రేమ అన్న విషయం తెలి సిందే. ముఖ్యంగా శునకాలంటే ఎనలేని మమకారం. రోడ్డు పక్కన ఎలాంటి కుక్క కని పించినా దాన్ని ఇంటికి తీసుకొచ్చి సంరక్షణ బాధ్య త తీసుకుంటారు. ఇటీవల శునక సంరక్షణ సంస్థ చిట్టాలో సభ్యురాలిగా చేరారు.

 

ఈ బ్యూటీ పెం చుకుంటున్న శునకాల ను తన స్నేహితురాళ్లు తీసుకెళ్లి పెంచుకుంటున్నారు. అంతే కాకుండా వీటికి త్రిష అనే పేరు పెట్టి పిలుచుకుంటున్నారట. ఈ విషయం తెలిసిన త్రిష తన పేరును కుక్క పిల్లలకు పెట్టినందుకు సంతోషం వ్యక్తం చేయ డం విశేషం. దీని గురించి ఈ బ్యూటీ తన ట్విట్టర్‌లో పేర్కొం టూ తన స్నేహితురాళ్లు రెండు కుక్కపిల్లల్ని దత్తత తీసుకుని వాటికి త్రిష అని పేరు పెట్టుకోవడం సంతోషంగా ఉందన్నారు. త్వరలోనే మరికొన్ని కుక్క పిల్లలకు తన పేరు పెట్టుకుంటారని భావిస్తున్నానని పేర్కొన్నారు. ఇది తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు త్రిష పేర్కొన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top