నలుగురు స్టార్స్‌తో తెలంగాణ సాయుధ పోరాటం

నలుగురు స్టార్స్‌తో తెలంగాణ సాయుధ పోరాటం


‘‘తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటంలో నేనూ పాల్గొన్నాను. ఇప్పుడు రాష్ట్రాన్ని సాధించుకున్నాం కదా అని వెంటనే సినిమాలు చేస్తే అది స్వార్థం అవుతుంది. మరో మూడు నాలుగు నెలల్లో తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి నుంచి సినిమాలు తీయాలనుకుంటున్నా’’ అని దర్శక, నిర్మాత సానా యాదిరెడ్డి చెప్పారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా బుధవారం పత్రికలవారితో మాట్లాడుతూ - ‘‘ప్రస్తుతం మూడు కథలు సిద్ధంగా ఉన్నాయి.



వాటిలో ఒకటి మల్టీస్టారర్. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలకు చెందిన నలుగురు హీరోలతో ‘తెలంగాణ సాయుధ పోరాటం’ పేరుతో ఈ చిత్రం చేయాలనుకుంటున్నా. అలాగే, అంతా నూతన తారలతో ఓ ప్రేమకథా చిత్రం, మరో కుటుంబ కథా చిత్రం తీయాలనుకుంటున్నా’’ అని తెలిపారు. తెలంగాణ లో చిత్రసీమను బలోపేతం చేయడం కోసం పోరాటం చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.



తెలంగాణ సినిమా అంటే డిఫైన్, డిజైన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ డెలివరీ అని, ఈ త్రీ‘డి’ విధానాన్ని అభివృద్ధి చేస్తే తెలంగాణాలో సినిమా బలోపేతం అవుతుందని యాదిరెడ్డి తెలిపారు. చెన్నయ్‌లో ‘అమ్మ థియేటర్లు’ ఉన్నట్లుగా.. ఇక్కడ కూడా ఉండాలని, వంద సీట్లు ఉండి, రోజుకి ఇరవై, ముప్ఫయ్ వేలు వచ్చినా ఫర్వాలేదని, అలాంటి థియేటర్లని ఏర్పాట్లు చేయాలని ఓ లాయర్‌గా, నిర్మాతగా కోరుకుంటున్నానని సానా యాదిరెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రకటించగానే ఎవరు పడితే వాళ్లు యూనియన్లు పెడుతున్నారని, అలా కాకుండా ఒక పటిష్ఠమెన కమిటీ ఏర్పడి, 24 శాఖలూ ఒకే చోట ఉండేలా చేయాలని ప్రభుత్వాన్ని కోరామని సానా వెల్లడించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top