జెట్ వేగానికి బ్రేక్ వేయలేను!

జెట్ వేగానికి బ్రేక్ వేయలేను! - Sakshi


 ‘‘వాహనం వేగంమీద ఉన్నప్పుడు బ్రేక్ వేయకూడదు... బొక్కబోర్లా పడతాం.  ఈ టైమ్‌లో నేను పెళ్లి చేసుకున్నా అంతే’’ అంటున్నారు తమన్నా. ప్రేమ, పెళ్లి గురించి... ఇటీవల ఓ బాలీవుడ్ చానల్ తమన్నా ముందు ప్రస్తావిస్తే ఆమె ఈ తీరుగా స్పందించారు. ఇంకా చెబుతూ-‘‘నా కెరీర్ జెట్ వేగంతో దూసుకుపోతోంది. ఇలాంటి టైమ్‌లో పెళ్లి చేసుకుంటే... నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పిదం అవుతుంది. అయినా... ప్రేమించడానికీ, పెళ్లాడటానికీ నాకు టైమే లేదు. నా ధ్యాస, శ్వాస అంతా నటనే’’ అని చెప్పారు తమన్నా. ‘‘ప్రతి ఒక్కరూ వయసునే... ఆడపిల్ల పెళ్లికి అర్హతగా భావిస్తుంటారు. అది తప్పు. అనుకోకుండా ఓ బంధం ఏర్పడాలి.

 

  అది పెళ్లి పీటల దాకా తేవాలి. అప్పుడే ఆ పెళ్లికి అర్థం పరమార్థం. పెళ్లి అనేది అదేదో పనిగా చేసుకోకూడదు. వయసు రాగానే పిల్లకు పెళ్లి చేయాలనే ఆలోచనను పెద్దలు విరమించుకోవాలి. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికీ కొన్ని లక్ష్యాలు, కోరికలు, అభిప్రాయాలు ఉంటాయి. ముందు తమ బిడ్డ మనోగతమేంటో తల్లిదండ్రులు తెలుసుకోవాలి. పెళ్లి అనేది తల్లిదండ్రుల ఇష్టప్రకారం జరగడం ముఖ్యం కాదు. అమ్మాయి ఇష్టప్రకారం జరగడం ముఖ్యం’’ అన్నారు తమన్నా. అంటే... మీరు ప్రేమించి పెళ్లాడతారన్నమాట? అనంటే... ‘‘అమ్మానాన్నా చూపించిన అబ్బాయి మీద ప్రేమ కలుగకూడదా?. అసలు ఇప్పటివరకూ ‘ప్రేమ’ అనే భావనే నాకు కలుగలేదు. నా అభిప్రాయం చెప్పానంతే’’ అన్నారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top