అజయ్‌ వల్లే ఒంటరిగా మిగిలిపోయాను: నటి

అజయ్‌ వల్లే ఒంటరిగా మిగిలిపోయాను: నటి - Sakshi

ముంబయి: బాలీవుడ్‌ ప్రముఖ హీరో అజయ్‌ దేవగన్‌పై ప్రముఖ నటి టబూ పెద్ద నిందలే వేశారు. తాను పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అజయ్‌ కారణం అని చెప్పారు. తాను ఈ రోజు ఇలా ఒంటరిగా ఉండాల్సి వచ్చిందంటే అందుకు కారణం అతడే(నవ్వులు) అని వివరించారు. ప్రస్తుతం అజయ్‌ దేవగన్‌తో రోహిత్‌ షెట్టీ దర్శకత్వంలో వస్తున్న గోల్‌మాల్‌ 4 చిత్రంలో నటిస్తున్న ఈ అమ్మడు ముంబయి మిర్రర్‌తో మాట్లాడుతూ ఈ సరదా సంభాషణ సాగించారు.



మీరు ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉండటానికి కారణం ఏమిటని ప్రశ్నించగా స్పందించిన టబూ ‘నేను ఈ రోజు ఒంటిరిగా ఉండిపోవాల్సి వచ్చిందంటే అందుకు అజయ్‌ దేవగన్‌ మా కజిన్‌ కారణం. నాతో ఏ అబ్బాయి అయినా మాట్లాడినట్లు కనిపిస్తే అతడిని కొడతామని హెచ్చరించేవారు. దాంతో నేను ఎవరితోనూ మాట్లాడే ప్రయత్నం చేయలేదు. వారు అలా అప్పుడు చేసిన పనికి ఇప్పుడు బాధపడుతున్నారు. ఇప్పటికీ నేను అజయ్‌కు చెప్పాను.. పెళ్లి చేసుకునేందుకు నా కోసం ఓ అబ్బాయిని వెతికి పెట్టమని’ అంటూ ఆమె సరదాగా చెప్పుకొచ్చారు. ఇది వరకే విజయపథ్‌, దృశ్యం వంటి చిత్రాల్లో అజయ్‌తో కలిసి టబూ నటించిన విషయం తెలిసిందే.
Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top