షూటింగ్ పూర్తి చేసుకున్న ఎస్ 3

షూటింగ్ పూర్తి చేసుకున్న ఎస్ 3


కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ యాక్షన్ డ్రామా సీరీస్ సింగం. ఇప్పటికే రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమాకు ఇప్పుడు మూడో సీక్వల్ రెడీ అవుతోంది. మరోసారి సూర్య పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. చెన్నైతో పాటు వైజాగ్. హైదరాబాద్, పలు ఫారిన్ లోకేషన్లలో భారీగా ఈ సినిమాను చిత్రీకరణ జరిపారు.



తొలి రెండు భాగాల్లో హీరోయిన్ గా నటించిన అనుష్క మరోసారి సింగంతో జోడి కడుతోంది. మరో హీరోయిన్ గా శృతిహాసన్ నటించింది. గత చిత్రాలకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ఈ సినిమాకు మాత్రం హారీష్ జయరాజ్ ను తీసుకున్నారు. దీపావళి సందర్భంగా ఈ సినిమా తొలి టీజర్ రిలీజ్ కానుంది. డిసెంబర్ 16న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top