క్రియేటివిటీ కంటే కథే ముఖ్యం - దర్శకుడు కోడి రామకృష్ణ

క్రియేటివిటీ కంటే కథే ముఖ్యం - దర్శకుడు కోడి రామకృష్ణ


‘‘ ఒక సినిమా తీయాలంటే దర్శకుడి క్రియేటివిటీ ఒక్కటే సరిపోదు. ఒక మంచి కథ ఉండాలి. ఆ కథను ఇష్టపడే, సినిమా అంటే ప్యాషన్ ఉండే నిర్మాత కావాలి. అప్పుడే ఆ సినిమా బాగా వస్తుంది’’ అని దర్శకుడు కోడి రామకృష్ణ అన్నారు. ‘అమ్మోరు’, ‘దేవి’, ‘అరుంధతి’ వంటి విజువల్ వండర్స్‌ని రూపొందించిన ఆయన తాజాగా కన్నడంలో తెరకెక్కించిన చిత్రం ‘నాగభరణం’. జయంతి లాల్ గాడా, సాజిద్ ఖురేషి, సోహైల్ అన్సారీ నిర్మించారు.

 

 గురుకిరణ్ పాటలు స్వరపరిచారు. సురక్ష ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను నటుడు సాయికుమార్, బిగ్ సీడీని తెలంగాణ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, పాటల సీడీని దర్శకుడు ఎన్. శంకర్ విడుదల చేశారు. కోడి రామకృష్ణ మాట్లాడుతూ- ‘‘కన్నడ స్టార్ విష్ణువర్ధన్‌గారు నాకు మంచి ఫ్రెండ్. మీతో ఓ సినిమా చేస్తానని ఆయనకు  కథ వినిపించా. ‘బాగుంది. రెండు నెలల్లో డేట్స్ ఇస్తా’ అన్నారు. నేను స్క్రిప్ట్ వర్క్ కోసం బ్యాంకాక్ వె ళ్లి వచ్చేలోగా ఆయన చనిపోయారు. అది నా దురదృష్టం.

 

 ఈ చిత్రం క్లయిమాక్స్‌లో గ్రాఫిక్స్‌లో విష్ణువర్ధన్‌గారిని చూపిద్దామని సాజిద్ నాకు చెప్పారు. దీంతో మకుట సంస్థ విజువల్ ఎఫెక్ట్స్‌లో ఆయన్ను తెరపై చూపించాం’’ అని చెప్పారు. ‘‘నాగదేవత ముఖ్య పాత్రలో ఇటీవల సినిమాలు రాలేదు. ‘నాగభరణం’ ఆ తరహా చిత్రం. ఓ మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఈ చిత్రం హక్కులు కొన్నా. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో ఈ నెల 14న సినిమా విడుదల చేస్తున్నాం’’ అని మల్కాపురం శివకుమార్ అన్నారు. నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, గిరిధర్, సురేశ్ కొండేటి, బీఏ రాజు, చిత్ర సహనిర్మాత సలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top