బాహుబలి వచ్చేస్తున్నాడు.. మే 15 విడుదల!
సినిమా అభిమానులు ఎన్నాళ్ల నుంచో వేచి చూస్తున్న రోజు ఎప్పుడో తెలిసిపోయింది. ప్రభాస్ హీరోగా హిట్ చిత్రాల దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న బాహుబలి సినిమా మే 15వ తేదీన విడుదల కాబోతోంది. ఈ విషయం స్వయంగా రాజమౌళే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఒక్క పాట తప్ప మొత్తం టాకీ పార్ట్ అంతా పూర్తయిపోయిందని రాజమౌళి తన ట్విట్టర్ వీడియోలో చెప్పారు. భారత సినీ పరిశ్రమలోనే మొత్తం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా.. బాహుబలి.
''మా బాహుబలి టీం అంతా ఎంతో సంతోషంగా ఉంది. ఒక్క పాట తప్ప, మొత్తం టాకీ పార్ట్ అంతా పూర్తయింది. బాహుబలి మొదటి భాగాన్ని మే 15న విడుదల చేస్తున్నానని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నా'' అని రాజమౌళి తెలిపారు. ఈ ప్రకటన చేస్తూ వీడియోను కూడా ఆయన పోస్ట్ చేశారు.
Here is the answer from @ssrajamouli for the most asked question! #BaahubaliinMay pic.twitter.com/PuKI3K21NB
— Baahubali (@BaahubaliMovie) March 4, 2015