మోహన్ లాల్‌ చిత్రంలో నటించనున్నా

మోహన్ లాల్‌ చిత్రంలో నటించనున్నా


మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్ లాల్‌ చిత్రంలో తానూ నటించనున్నానని నటి సృష్టి డాంగే పట్టరాని ఆనందంతో పేర్కొన్నారు. ఈ బ్యూటీ ఇటీవలే విజయాల బాట పట్టారు. ఇటీవల తెరపైకి వచ్చిన అచ్చమిండ్రి ఈ అమ్మడి ఖాతాలో చేరిన తాజా సక్సెస్‌. దీంతో యమ జోష్‌లో ఉన్న సృష్టిడాంగే మాట్లాడుతూ నిరంతర శ్రమతోనే తాను విజయాల బాట పట్టానని చెప్పారు. నాలుగు విజయాల తరువాత తాను సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్ల జాబితాలో చోటు సంపాదించుకున్నానని అన్నారు.


ఈ ఏడాది తాను నటించిన కనీసం పది చిత్రాలైనా విడుదలవుతాయన్నారు. అంత కంటే సంతోషకరమైన విషయం ఏమిటంటే తొలిసారిగా మలయాళ చిత్ర రంగప్రవేశం చేయనున్నానని, అదీ లెజెండ్‌ యాక్టర్‌ మోహన్ లాల్‌ నటిస్తున్న చిత్రం 1071 బియోండ్‌ ది బార్డర్‌ అనే అత్యంత భారీ చిత్రం ద్వారా మాలీవుడ్‌లో పరిచయం అయ్యే అవకాశం వచ్చిందని తెలిపారు. మోహన్ లాల్, మేజర్‌ రవి కాంబినేషన్ లో చిత్రం అంటే దానిపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోవచ్చన్నారు. ఈ చిత్రంలో నటించడానికి ఒప్పందం అవ్వగానే ఎప్పుడెప్పుడు అందులో నటిద్దామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నానన్నారు.


తాను ఇందులో అల్లుఅర్జున్ కు జంటగా నటించనున్నానని తెలిపారు. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రం ఆర్మీ నేపథ్యంలో రూపొందనుందని చెప్పారు. మొత్తం మీద 2017 తన నమ్మకాన్ని మరింతగా పెంచే సంవత్సరంగా ఉంటుందనే సంతోషాన్ని సృష్టి డాంగే వ్యక్తం చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top