పోలీస్ రియాక్షన్...!

పోలీస్ రియాక్షన్...!


‘‘దేశంలోని అన్ని రాష్ట్రాల్లో టెర్రరిజం సమస్య ఉంది. హైదరాబాద్‌లో కూడా టెర్రరిస్ట్ కార్యకలాపాలు జరుగుతాయని తెలుసుకున్న ఓ పోలీసాఫీసర్ ఎలా రియాక్ట్ అయ్యాడనేదే ఈ చిత్ర కథాంశం’’ అని దర్శకుడు సతీష్ కాసెట్టి తెలిపారు. శ్రీకాంత్, నికిత జంటగా అఖండ భారత క్రియేషన్స్ పతాకంపై షేక్ కరీమ్ సమర్పణలో షేక్ మస్తాన్ నిర్మించిన ‘టై’ మార్చి 4న విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో శ్రీకాంత్ మాట్లాడుతూ- ‘‘కమర్షియల్ ఫార్మాట్‌లో ఉండే క్లీన్ మూవీ ఇది.



అవుట్‌పుట్ బాగా వచ్చింది. ఈ చిత్రానికి అవార్డులు వస్తాయనుకుంటున్నాం. కచ్చితంగా అందరికీ నచ్చే చిత్రమిది’’ అని పేర్కొన్నారు. నిర్మాత మస్తాన్, నటుడు పృథ్వి, మాటల రచయిత లక్ష్మీ భూపాల్ తదితరులు పత్రికా సమావేశంలో పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, కెమెరా: శ్యామ్ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: హరి అయినీడి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top