అమ్మలకు మామ్‌ అంకితం

అమ్మలకు మామ్‌ అంకితం


ఇక్కడ మహిళకు రక్షణ కరువైందని అతిలోక సుందరిగా కొనియాడబడిన నాటి, నేటి మేటి నటి శ్రీదేవి వ్యాఖ్యానించారు. తమిళం, తెలుగు, హిందీ అంటూ పలు భాషల్లో కథానాయకిగా ఏలిన ఈ ఎవర్‌గ్రీన్‌ నటి బోనికపూర్‌తో వివాహానంతరం నటనకు దూరంగా ఉండి అనంతరం ఆ మధ్య ఇంగ్లిష్‌ వింగ్లీష్‌ చిత్రంతో రీఎంట్రీ అయ్యారు. ఆ చిత్ర విజయం శ్రీదేవితో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచిందనే చెప్పాలి.


తాజాగా మామ్‌ అనే చిత్రంతో మరోసారి ప్రపంచ వ్యాప్తంగా తరపైకి రావడానికి సిద్ధం అవుతున్నారు. విశేషం ఏమిటంటే ఇది శ్రీదేవి 300ల చిత్రం కావడం. తన భర్త బోనీకపూర్‌ నిర్మించిన ఈ హిందీ చిత్రం తమిళం, తెలుగులోనూ అనువాదరూపంలో త్వరలో విడుదల కానుంది. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా మామ్‌ చిత్ర యూనిట్‌ గురువారం స్థానిక ప్రసాద్‌ ల్యాబ్‌లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న నటి శ్రీదేవి మాట్లాడుతూ స్త్రీలకు, అమ్మాయిలకు రక్షణ కరువైందన్నారు. ఆడ పిల్లలు బయటకు వెళితే తిరిగి వచ్చే వరకూ వారి తల్లులు గుండెలపై కుంపటి పెట్టుకున్నంతగా ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.అలా తల్లీకూతుళ్ల అనుబంధాన్ని ఆవిష్కరించే చిత్రంగా మామ్‌ ఉంటుందన్నారు.



ఇది యూనివర్శల్‌ కథాంశంతో తరకెక్కించిన చిత్రం అని తెలిపారు. ఇందులో తన కూతురు జాహ్నవి కూడా నటిచండం విశేషం అని అన్నారు.తాను జీవితంలో ఇంత ఉన్నత స్థాయికి చేరుకోవడానికి తన తల్లి రాజేశ్వరినే కారణంగా పేర్కొన్నారు.ఆమె తనను పెంచిన దానిలో 50 శాతం తాను తన పిల్లలను పెంచడమే గొప్ప అని అన్నారు. మాతృమూర్తులందరికీ మామ్‌ చిత్రాన్ని అంకితం చేస్తున్నట్లు అతిలోక సుందరి శ్రీదేవి పేర్కొన్నారు. ఏఆర్‌.రెహ్మాన్‌ సంగీతం మామ్‌ చిత్రానికి మరింతబలాన్ని చేకూర్చిందని వ్యాఖ్యానించారు.తమిళనాడు తనకు ఎంతో ప్రేమను, అభిమానాన్ని అందించిందన్నారు. సంగీత దర్శకుడు ఏఆర్‌.రెహ్మాన్‌ మాట్లాడుతూ మామ్‌ యూనివర్శల్‌ ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం అని చెప్పారు. ఇందులో బ్యాగ్రౌండ్‌ సాంగ్స్‌ మాత్రమే ఉంటాయని తెలిపారు. చిత్ర నిర్మాత బోనీకపూర్‌ కూడా పాల్గొన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top