సోనమ్ కపూర్‌కు స్వైన్ ఫ్లూ
ముంబై: బాలీవుడ్ యువ నటి సోనమ్ కపూర్‌కు స్వైన్ ప్లూ సోకింది. వైద్య పరీక్షల్లో పాజిటీవ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆమె రాజ్‌కోట్‌లోని స్టెర్లిన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఓ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు గుజరాత్ వెళ్లిన సోనమ్ కు దగ్గు, తీవ్ర జ్వరం వచ్చింది. దీంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపించడంతో నిర్ధారణ కోసం బ్లడ్ శాంపిల్స్‌ను తీసుకున్నారు. పరీక్షలు ఆమెకు స్వైన్ ఫ్లూ సోకినట్టు వెల్లడైంది. సోనమ్ పాల్గొంటున్న సినిమా సెట్లో బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, అనుపమ్ ఖేర్ కూడా ఉన్నారు. సోనమ్ బాలీవుడ్ ప్రముఖ నటుడు అనిల్ కపూర్ కుమార్తె.
సంబంధిత వార్తలు