అప్పుడు నిద్రలేస్తే..సగం పోయినట్లే!

అప్పుడు నిద్రలేస్తే..సగం పోయినట్లే!


 ‘‘ఒక మనిషి ఇంతకుమించి పని చేయడం కుదరదు అన్నంత బిజీగా సినిమాలు చేస్తున్నాను. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఐదారు సినిమాలు చేస్తున్నా. ఆ మధ్య ఎవరో ఒకేసారి ఇన్ని సినిమాలు ఎలా చేయగలుగుతున్నావని అడిగితే, ఒక్కసారిగా నవ్వేశాను. కరెక్టే.. శక్తికి మించి ఈ మధ్య పని చేస్తున్నా. ఎందుకంటే, మా నాన్న నీడలో నేను పెరిగాను. సూర్యోదయానికి ముందు నిద్రలేవడం ఆయన అలవాటు. అదే నాకు కూడా అలవాటయ్యింది.

 

  సూర్యోదయానికి ముందు నిద్ర లేచి, దినచర్య మొదలుపెట్టేవాళ్లు రోజంతా హుషారుగా ఉంటారు. అదే బద్ధకంగా ఓ పది, పన్నెండు గంటలకు నిద్రలేస్తే.. సగం జీవితం అయిపోయినట్లే. ఇక, అప్పుడు ఏమీ సాధించలేం. మా నాన్న విశ్రాంతికి తక్కువ, పనికి ఎక్కువ సమయం కేటాయించారు. నేనూ అంతే. ఎంత అలసిపోయినా ఏడెనిమిది గంటలకు మించి నిద్రపోను. ఎవరికైనా అన్ని గంటల నిద్ర సరిపోతుంది. ఇప్పుడు నిద్ర గురించి ఎందుకింత లెక్చర్ అనుకోవద్దు. నాకు తెలిసిన నాలుగు మంచి విషయాలు పంచుకుంటున్నానంతే. ’’

 

  శ్రుతీహాసన్, కథానాయిక

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top