ముందు కోలీవుడ్‌కే వస్తా!

ముందు కోలీవుడ్‌కే వస్తా! - Sakshi


ముందుగా కోలీవుడ్‌కే వస్తానంటోంది నట దంపతులు రాజశేఖర్, జీవితల వారసురాలు శివాని. ఈ అమ్మడు తల్లిదండ్రుల బాటలోనే నడవడానికి సిద్ధం అయ్యిందట. రాజశేఖర్, జీవిత తమ సినీ జీవితాన్ని కోలీవుడ్‌లో ప్రారంభించి ఆ తరువాత టాలీవుడ్‌లో రాణించారన్నది తెలిసిందే. వారి వారసురాలు శివానీ కూడా తన సినీ జీవితాన్ని కోలీవుడ్‌ నుంచే శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించింది. రాజశేఖర్, జీవితలకు శివాని, శివాద్మి కూతుళ్లు. వారిలో పెద్ద కూతురు శివాని. తల్లి జీవిత పోలికలను పుణికిపుచ్చుకున్న ఈ బ్యూటీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.



అందులో.. అమ్మ, నాన్న సినిమాకు చెందిన వారు కావడంతో నాకూ సినిమా, నటన చిన్నతనం నుంచి పరిచయమే. భరతనాట్యం, కూచిపూడి లో శిక్షణ పొందాను. సంగీతం అంటే చాలా ఆసక్తి. కీబోర్డ్, గిటార్, వీణ వాయిద్యాల్లో పరిచయం ఉంది. చెల్లెలు శివాద్మితో కలిసి యూట్యూబ్‌లో పాడుకుంటుండడమే మాకు కాలక్షేపం. కిక్‌బాక్సింగ్‌ నేర్చుకుంటున్నాను. ఇక ఫిట్‌నెస్‌పై శ్రద్ధ ఎక్కువ. దానికి నేను అడిక్ట్‌ అనే చెప్పాలి. పుట్టింది తమిళనాడులో, పెరిగింది హైదరాబాద్‌లో. బంధువులందరూ చెన్నైలోనే ఉన్నారు. వారితో తమిళంలోనే మాట్లాడతాను. ఎక్కువగా తమిళ చిత్రాలు చూస్తుంటాను.



 నటుడు ధనుష్‌ అంటే ఎంతిష్టమో. ఆయన నటించిన 3 చిత్రం చూసి ఎమోషన్‌తో ఏడ్చేశాను. నటుడు విశాల్‌ అంటే చాలా ఇష్టం. ఇక విజయ్‌సేతుపతి భలే యాక్టర్‌. అయినా నాకెప్పటికీ నాన్నే హీరో. వైద్య విద్య మూడో సంవత్సం చదువుతున్నాను. డాక్టర్‌ అయిన తరువాతే యాక్టర్‌ అవ్వమని అమ్మ, నాన్న అన్నారు అని శివాని చెప్పుకొచ్చింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top