ఆ హీరోయిన్‌ విషయమా? అందరికీ తెలుసు..

ఆ హీరోయిన్‌ విషయమా? అందరికీ తెలుసు..


న్యూఢిల్లీ: బాలీవుడ్ నటులు షాహిద్ కపూర్, కరీనా కపూర్‌లు గతంలో కొన్నాళ్లు ఎఫైర్ నడిపారు. వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటకు రావడం అప్పట్లో దుమారం రేపింది. ఈ జంట పెళ్లి చేసుకుంటుందని వార్తలు వచ్చినా, ఇద్దరూ బ్రేకప్ చెప్పేశారు. ఆ తర్వాత షాహిద్.. మీరా అనే అమ్మాయిని, కరీనా.. హీరో సైఫ్ అలీ ఖాన్‌లను పెళ్లి చేసుకున్నారు. ఈ రెండు జంటలు ఒక్కో బిడ్డకు జన్మనిచ్చారు. ఇదంతా గతం.



తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ సదస్సులో షాహిద్, కరీనా ప్రేమ విషయం చర్చకు వచ్చింది. ఓ ప్రేక్షకురాలు  మీ గతానికి సంబంధించిన రహస్యం చెప్పాలని షాహిద్‌ను కోరగా.. 'నాకో రహస్యం ఉంది. ఈ విషయం మీకెలా తెలుసు? నాపై నిఘా పెట్టారా? ఆ విషయాన్ని చెప్పను' అని అన్నాడు. సభలో నుంచి కరీనా పేరును గట్టిగా అరవడంతో.. 'ఆ విషయం రహస్యం ఎలా అవుతుంది? బహిరంగ రహస్యం' అని షాహిద్ చెప్పాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top