'సంగీత్'లో షాహిద్ కపూర్, మీరా డాన్స్

'సంగీత్'లో షాహిద్ కపూర్, మీరా డాన్స్


న్యూఢిల్లీ: బాలీవుడ్ యువ హీరో షాహిద్ కపూర్ తన కాబోయే భార్య మీరా రాజ్పుట్తో కలసి చిందేశారు. సోమవారం రాత్రి ఛతర్పూర్ ఫాంహౌస్లో జరిగిన సంగీత్ కార్యక్రమంలో షాహిద్, మీరా డాన్స్ చేశారు. షాహిద్ స్నేహితుడు, ఫొటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠ ఈ ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. వధువు మీరా ఢిల్లీకి చెందినవారు.



ఆదివారం రాత్రి షాహిద్ కుటుంబ సభ్యులు గుర్గావ్ వచ్చారు. మంగళవారం రాత్రి ఓ హోటల్లో జరిగే షాహిద్ వివాహానికి కుటుంబ సభ్యులు, స్నేహితులను మాత్రమే ఆహ్వానించారు. ఈ నెల 12న బాలీవుడ్ ప్రముఖుల కోసం ముంబైలో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top