ఒబామా జీ.. సంతోషంగా ఉంది: షారుక్

ఒబామా జీ.. సంతోషంగా ఉంది: షారుక్ - Sakshi


న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రసంగంలో తన పేరు ప్రస్తావించినందుకు సంతోషంగా ఉందని బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఉప్పొంగిపోయారు. మంగళవారం షారుక్ ఈ మేరకు ట్వీట్ చేశారు.  



ఒబామా ఈ రోజు ఉదయం సిరిఫోర్ట్ ఆడిటోరియంలో ప్రసంగిస్తూ.. షారుక్ ఖాన్ నటించిన దిల్వాలే దుల్హనియా లేజాయేంగే చిత్రం విజయాన్ని ప్రస్తావించారు. లింగ, మత వివక్ష గురించి ఒబామా మాట్లాడుతూ.. దిల్వాలే దుల్హనియా లేజాయేంగేలోని ఓ డైలాగ్ చెప్పారు. ఇంకా ప్రఖ్యాత క్రీడాకారుడు మిల్కాసింగ్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, స్వామి వివేకానంద తదితరుల గురించి మాట్లాడారు. ఈ నేపథ్యంలో షారుక్ ఒబామాకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో షారుక్ ఒబామాకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఒబామా మరోసారి భారత పర్యటనకు వచ్చినపుడు ఛయ్యా.. ఛయ్యా పాటకు డాన్స్ చేస్తానని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ పాట షారుక్ నటించిన దిల్ సే చిత్రంలోనిది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top