బాలీవుడ్‌ హీరో, హీరోయిన్‌కు నోటీసులు

బాలీవుడ్‌ హీరో, హీరోయిన్‌కు నోటీసులు

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, అతడి భార్య గౌరి ఖాన్, నటి జూహీ చావ్లాకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం నోటీసులు జారీచేసింది. ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్ యాక్ట్(ఫెమా) నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఈ నోటీసులు పంపింది. ఈ నెల 23న విచారణకు రావాలని వారిని ఈడీ ఆదేశించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ టీమ్‌కు ప్రమోటర్స్‌గా వ్యవహరిస్తున్న వీరు, షేర్లను తక్కువ ధరకు విలువకట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2009లో మార్షియస్‌కి చెందిన ఓ కంపెనీకి ఈ ముగ్గురు తమ కంపెనీలోని కొన్ని షేర్స్‌ని తక్కువ ధరకి అమ్మిన కారణంగా, ఫారెన్ ఎ‍క్స్చేంజ్‌ రూపంలో ప్రభుత్వానికి రూ.73.6 కోట్ల నష్టం వాటిల్లినట్టు తెలిసింది.

 

ఈ షేర్స్‌ని కొనుగోలు చేసిన మార్షియస్‌కి చెందిన కంపెనీ ది సీ ఐస్లాండ్ ఇన్‌వెస్ట్‌మెంట్ లిమిటెడ్(టీఎస్ఐఐఎల్) మరెవరిదో కాదు... జూహీ చావ్లా భర్త జే మెహ్తదే. గతంలోనూ ఈ ఆరోపణలకు సంబంధించి, షారుఖ్‌ ఖాన్‌, గౌరీ ఖాన్‌, జూహీ చావ్లా, మరికొంత మందికి ఈడీ షోకాజు నోటీసులు కూడా జారీచేసింది. ఈ క్రికెట్‌ టీమ్‌ యజమానుల్లో జూహ్లీ చావ్లా, ఆమె భర్త కూడా ఉన్నారు. గతంలోనే ఈ కేసుకి సంబంధించిన వ్యాపార లావాదేవీలు, షేర్స్ అమ్మకాలు వంటి అంశాలపై షారుఖ్ ఖాన్ వాంగ్మూలం తీసుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షారుఖ్, గౌరి, జూహీలపై ఫెమా చట్టం కింద కేసులు నమోదు చేసింది.

 
Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top