90 కిలోల వెయిట్స్ ఎత్తిన హీరోయిన్!

90 కిలోల వెయిట్స్ ఎత్తిన హీరోయిన్! - Sakshi


పెళ్లి ఘడియలు దగ్గర పడుతున్నకొద్దీ ఫిట్‌నెస్ మీద సమంత బాగా దృష్టి పెడుతున్నట్లుంది. ముందునుంచి ఫిట్‌నెస్ ఫ్రీక్ అయిన ఈ హీరోయిన్ వర్కవుట్లు బాగానే చేస్తుంది. అందులో భాగంగానో, లేదా కొత్త సినిమా కోసమో.. కాదంటే పెళ్లి నాటికి చక్కనమ్మలా చిక్కాలనో గానీ ప్రస్తుతం వెయిట్ల మీద దృష్టిపెట్టింది. పది, ఇరవై కాకుండా ఏకంగా 90 కిలోల వెయిట్లు ఎత్తేసింది. జిమ్‌లో చేసిన ఈ హడావుడిని చిన్న వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. శుక్రవారం నాడు వర్కవుట్లలో భాగంగా ఇలా 90 కిలోలు ఎత్తినట్లు చెప్పింది. జుట్టు ముడిపెట్టి.. ఓ నాలుగు సార్లు ఎత్తిన తర్వాత ఇక వాటిని పక్కన పడేసి చక్కగా వెళ్లిపోయింది.



చైతూ అలిగాడా?

సమంత విషయంలో అన్నీ బాగానే ఉంటాయి గానీ, వ్యక్తిగతంలో ఉంచుకోవాల్సిన కొన్ని విషయాలను కూడా ఆమె ఫొటోలు తీసేసి ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లలో పోస్ట్ చేసేస్తుంది. సరిగ్గా ఈ విషయంలోనే ఆమెకు కాబోయే భర్త చైతూ కాస్త అలకబూనినట్లు సమాచారం. మొన్నీమధ్య కూడా చైతూ సరదాగా ఏవో స్నాక్స్ చేసి పెడుతుంటే దానికి సంబంధించిన ఫొటోలు తీయించి వాటిని ఇన్‌స్టాలో పెట్టేసింది. అప్పటివరకు చైతూ వంట విషయం ఒక్క ప్రేమమ్ సినిమాలో తప్ప విడిగా ఎవ్వరికీ తెలియదు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top