అందుకే నాన్నగారి పేరు పెట్టుకున్నా!

అందుకే నాన్నగారి పేరు పెట్టుకున్నా! - Sakshi


‘‘వరుసగా కమర్షియల్‌ సినిమాలు చేస్తున్నాననిపించింది. వైవిధ్యమైన పాత్రలు చేద్దామని చాలా కథలు విన్నా. ఆ ప్రాసెస్‌లో ‘చుట్టాలబ్బాయి’ చిత్రం తర్వాత గ్యాప్‌ వచ్చింది’’ అని హీరో ఆదీ సాయికుమార్‌ అన్నారు. ఆదీ సాయికుమార్, నారా రోహిత్, సందీప్‌ కిషన్, సుధీర్‌ బాబు హీరోలుగా రాజేంద్రప్రసాద్‌ ముఖ్య పాత్రలో శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శమంతకమణి’. వి. ఆనంద ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలవుతోంది. ఆది చెప్పిన విశేషాలు.



శ్రీరామ్‌ ఆదిత్య ఈ చిత్రకథ చెబుతానన్నప్పుడు నలుగురు హీరోలు.. నా పాత్రకు ప్రాధాన్యం ఉంటుందా? అనుకున్నా. నారా రోహిత్, సుధీర్‌బాబు, సందీప్‌ కిషన్‌ ఆల్రెడీ ఫిక్స్‌. భవ్య క్రియేషన్స్‌ మంచి సంస్థ. ఇంత మంది కలిసి చేస్తున్నారంటే నాకు నమ్మకం వచ్చి, కథ విన్నా. పాత్ర బాగా నచ్చి ఓకే చెప్పేశా.



‘శమంతకమణి’లో ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్స్‌ అన్నీ ఉంటాయి. శ్రీరామ్‌ కథ రెడీ చేసుకున్నప్పుడే ఫస్ట్‌ లుక్, టీజర్, ట్రైలర్‌ ఎలా ఉండాలో నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకున్నాడు. అంత క్లారిటీతో కథ తయారు చేశాడు. సినిమాలో రోల్స్‌ రాయిస్‌ కారు పేరు ‘శమంతకమణి’. ఆ కారుకీ, కథకీ, మాకు సంబంధం ఏంటన్నది తెరపైనే చూడాలి.



ఈ సినిమాలో అందరి పాత్రలూ సమానంగా ఉంటాయి. ఈ చిత్రంలో పాటలున్నా డ్యాన్స్‌లు ఉండవు. సందర్భాన్ని బట్టి వస్తుంటాయి.

∙నారా రోహిత్, సుధీర్‌ బాబు, సందీప్‌ కిషన్‌.. ఇలా అందరికీ రెండు పేర్లున్నాయి. ఆది అంటే ఒకే పేరుంది.. ఏదైనా యాడ్‌ చేద్దామన్నారు దర్శకుడు. అందుకే నాన్నగారి పేరు (సాయికుమార్‌) పెట్టుకున్నా. ఆదీ సాయికుమార్‌ అని ఉంచాలా? వద్దా? అన్నది శమంతకమణి’ రిలీజ్‌  తర్వాత డిసైడ్‌ అవుతా.  



ప్రస్తుతం ప్రభాకర్‌ దర్శకత్వంలో చేస్తోన్న చిత్రం షూటింగ్‌ దాదాపుగా పూర్తి కావొచ్చింది. రెండు మూడు కథలు వింటున్నా. సొంత ప్రొడక్షన్‌లో మరో సినిమా చేద్దామని నాన్నగారు అన్నారు. నాకు వేరే ప్రాజెక్ట్స్‌ ఉండటం వల్ల కొద్ది రోజులు ఆగుదామన్నా.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top