'సల్మాన్ కేసు పేపర్లు కాలిపోయాయి'

'సల్మాన్ కేసు పేపర్లు కాలిపోయాయి'


ముంబై:ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్టీఐ(సమాచారహక్కు చట్టం) నిర్వీర్యం అవుతోందా?, సమాచార హక్కు చట్టం ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవుతోందా? అంటే అవుననే పరిస్థితులే కనిపిస్తున్నాయి. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసులో కీలకమైన సమాచారం అగ్గిపాలు అయిందంటూ అధికారులు ఇచ్చిన సమాధానం ఇందుకు మరింత బలాన్నిస్తుంది. ఇటీవల ఆ కేసుకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకునేందుకు ఆర్టీఐ ఉద్యమ కారుడు మన్సూర్ దర్వేష్ దాఖలు చేసుకున్న పిటిషన్  కు ..  ఆ పేపర్లు కాలిపోయాయని ప్రభుత్వం నుంచి వచ్చిన సమాధానం ఆందోళన కలిగిస్తోంది.



2002 నాటి సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసులో ప్రభుత్వం నుంచి నియమితులైన న్యాయ సలహాదారులు, న్యాయవాదులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ తదితర వివరాలను తెలుసుకునేందుకు దర్వేష్ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. అయితే ఆ కేసుకు సంబంధించి తమ దగ్గర ఎటువంటి సమాచారం అందుబాటులో లేదని.. జూన్ 21, 2012న సచివాలయంలో సంభవించిన అగ్నిప్రమాదంలో సల్మాన్ కేసు పేపర్లు బూడిద అయిపోయాయని ఆర్టీఐ అధికారులు సమాధానం ఇచ్చారు.  దీనిపై దర్వేష్ మండిపడుతున్నాడు. ఎటువంటి అవతవకలు లేకండా ఆ కేసు దర్యాప్తు జరుపుతామని ప్రభుత్వం ప్రజలకు ముందు హామీ ఇచ్చిన సంగతిని ఆయన గుర్తు చేశారు. ఆ కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే ప్రభుత్వం తిరిగి ఆ ఫైల్స్ ను పునరుద్ధరించాలని దర్వేష్ విజ్ఞప్తి చేశాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top