మహేష్బాబును 'టచ్' చేసిన బల్లాలదేవ


హైదరాబాద్:  ఇపుడు టాలీవుడ్ లో ఒక వీడియో  హల్ చల్ చేస్తోంది.  టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబును  విలక్షణ నటుడు రానా టచ్ చేశాడట.  అది అలా ఇలా కాదు ఏకంగా వంగి పాదాభివందనం చేసి మరీ శ్రీమంతుడు షాకయ్యేలా చేశాడట. దీంతో అటు మహేష్ ఫ్యాన్స్,  ఇటు రానా  ఫ్యాన్స్  హ్యాపీగా ఫీలవుతున్నారు. 

 

ఇంతకీ విషయం ఏమిటంటే  సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన ‘భలే మంచి రోజు' మూవీ ఆడియో వేడుకకు కాస్త ఆలస్యంగా వచ్చిన రానా  ముందు వరుసలో కూర్చున్న టాలీవుడ్ సూపర్ స్టార్  పాదాలకు నమస్కరించి మరీ కూర్చున్నాడట.  అయితే ఈ వేడుకకు రానా కంటే ముందుగానే తన కొడుకు గౌతంతో కలిసి వచ్చి కూర్చున్నారు మహేష్ బాబు.  రానా వచ్చీ రాగానే  మహేష్ బాబు వద్దకు వెళ్లి ఆయన పాదాలకు నమస్కరించాడు. మహేష్ బాబు వారించేలోపే ఇది జరిగిపోయింది. దీంతో అక్కడున్నవారితో సహా మహేష్ కూడా షాకయ్యారట. కాసేపటికి అందరూ తేరుకుని చిరునవ్వులు చిందించారట. అసలు రానా ఇలా చేస్తాడని ఉహించని మహేష్ ...ఎప్పటిలాగే చిరునవ్వులు చిందిస్తూ కబుర్లలో మునిగి పోయారు.   ఈ వీడియో ఇపుడు యూట్యూబ్ లో  చక్కర్లు కొడుతోంది. 

భలే మంచి రోజు ఆడియో సీడీలను మహేష్ బాబు ఆవిష్కరించి... తొలి సిడీ రానాకు అందజేసారు.  దీంతో  రానా, మహేష్ బాబు మధ్య అంతగా సఖ్యత లేదేమో  అంటూ ఇటీవల చెలరేగిన   అనుమానాలు పటాపంచలయ్యాయని టాలీవుడ్   భావిస్తోంది.

 

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top