'సూపర్ స్టార్‌తో సినిమా చేయట్లేదు'
యంగ్ హీరో రానా సోలో హీరోగానే కాక విలన్‌గా సపోర్టింగ్ రోల్స్ లోనూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో కూడా సినిమాలు చేసిన రానా.. త్వరలోనే మలయాళ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇవ్వనున్నాడన్న వార్త సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న ఓ యాక్షన్ డ్రామాలో రానా కూడా నటిస్తున్నాడంటూ భారీగా ప్రచారం జరిగింది.
అయితే ఈ ప్రచారం పై స్పందించిన రానా.. అలాంటిదేం లేదంటూ కొట్టి పారేశాడు. మోహన్ లాల్ లాంటి గ్రేట్ ఆర్టిస్ట్‌తో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని.. అయితే ప్రస్తుతానికి అలాంటి ప్రాజెక్ట్ ఏది లేదని తెలిపాడు. ప్రస్తుతం బాహుబలి 2 షూటింగ్లో బిజీగా ఉన్న రానా, ఆ సినిమాతో పాటు వార్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఘాజీ సినిమాను త్వరలోనే పూర్తి చేయనున్నాడు.