రామ్ గోపాల్ వర్మ 'మొగలిపువ్వు'

రామ్ గోపాల్ వర్మ 'మొగలిపువ్వు'


హైదరాబాద్: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈసారి 'మొగలిపువ్వు' సృష్టించారు. రొమాన్సు, ఫ్యామిలీ డ్రామాతో కూడిన సైకాలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ గా 'మొగలిపువ్వు' తెరక్కించారు. తన తాజా చిత్రం 'మొగలిపువ్వు' ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు వర్మ. ఈ టైటిల్ ను మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ సాంగ్ 'రగులుతోంది మొగలి పొద' నుంచి కాపీ కొట్టానని ట్విటర్ లో పేర్కొన్నారు. ప్రతి పెళ్లైన వాడి సెల్ ఫోన్ లో తన భార్యకి తెలియని సీక్రెట్లుంటాయ్ అంటూ పోస్టర్ పై ముద్రించారు. దీనికి వివరణ కూడా ఇచ్చారు.



'ప్రతి పెళ్ళైన మగాడూ బయట ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే టెంప్ట్ అవుతాడు. ప్రతి భార్య తన భర్తకేదైనా ఒక సీక్రెట్ ఎఫైర్ ఉందేమోనని భయపడుతూ వుంటుంది. ప్రతి పెళ్ళైన వాడి సెల్ ఫోన్ లో తన భార్యకి తెలియని సీక్రెట్ లు ఉంటాయి. ఎఫైర్ లు అనేవి పెళ్లి వ్యవస్థ పుట్టినప్పటినుంచీ వున్నాయి. కాని సెల్ ఫోన్లలో పాస్ వర్డ్ లు, వాట్స్అప్ లు, పేస్ టైం లు కెమెరాలు వగైరా వచ్చినప్పటి నుంచి అవి ఒక భయంకర స్థితికొచ్చేశాయి. టెక్నాలజీయే కాకుండా స్త్రీల పై అత్యాత్యచారాలని అరికట్టడానికి కొత్తగా వచ్చిన నిర్భయ లాంటి చట్ట సవరణలు స్త్రీ పురుష సంబంధాలలో భూకంపాలు పుట్టిస్తున్నాయి. ఇలాంటి బ్యాక్ గ్రౌండ్ తీసుకుని రాసిన కధే మొగలిపువ్వు' అని వర్మ తెలిపారు.



ఇప్పటివరకు అండర్ వరల్డ్, హారర్ సినిమాలు తీసిన వర్మ ఇప్పుడు వివాహ సంబంధాల నేపథ్యంలో చిత్రాలు రూపొందిస్తున్నారు. ఒక జంట భావోద్వేగాల ఆధారంగా ఆయన తెరకెక్కించిన ‘365 డేస్’ త్వరలో విడుదల కానుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top