తొలిసారి రాజకీయాల మీద ప్రేమ కలిగింది :వర్మ

తొలిసారి రాజకీయాల మీద ప్రేమ కలిగింది :వర్మ - Sakshi


తన సినిమాలతో కన్నా ట్వీట్స్తోనే ఎక్కువగా వార్తల్లో ఉండే రామ్గోపాల్ వర్మ మరోసారి తన ట్విట్టర్కు పని చెప్పాడు. ఎక్కువగా సినిమాల  మీదే స్పందించే ఈ కాంట్రవర్సియల్ డైరెక్టర్ అప్పుడప్పుడు సమకాలీన పరిస్థితుల మీద కూడా స్పందిస్తుంటాడు. ఈ సారి మాత్రం ఏకంగా అమెరికా ఎన్నికల విషయంలో కూడా తన మార్క్ స్టేట్మెంట్లతో అభిమానులను అలరించాడు.



డోనాల్డ్ ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్ గురించి ఓ కన్ఫ్యూజింగ్ ట్వీట్తో మొదలు పెట్టిన వర్మ, 'తెలంగాణకు కేసిఆర్, ఆంధ్రప్రదేశ్కు ఎన్టీఆర్ ఎలాగో అమెరికాకు ట్రంప్ అలా. ట్రంప్ను ఎన్నుకొన్ని అమెరికన్స్ కూడా తమలో ఇండియన్స్ మనస్థత్వం  ఉందని ప్రూవ్ చేసుకున్నారు. తెలివైన బరాక్ ఒబామా మౌనం కన్నా, డోనాల్డ్ ట్రంప్ ఫూలిష్నెష్ ఎంతో ఉన్నతంగా ఉందంటూ' ట్వీట్ చేశాడు.



ఇదే సమయంలో ఇండియన్ పాలిటిక్స్పై కూడా తన మార్క్ సెటైర్స్ వేశాడు. సినిమా హీరోయిన్లు పాలిటిక్స్లోకి రావటం తనకు ఎంతో ఆనందంగా ఉందంటూ తొలిసారిగా బీజేపీ తరపున అస్సాం ఎమ్మెల్యేగా గెలిచిన అంగూర్ లతా ఫోటోను పోస్ట్ చేశాడు. 'ఓ ఎమ్మెల్యే ఇలా కనిపిస్తుందంటే నిజంగానే మంచి రోజులు వచ్చాయి. థ్యాంక్యూ అంగూర్ లతాగారు, థ్యాంక్యూ మోడి గారు, తొలిసారిగా నాకు రాజకీయాలపై ప్రేమ కలిగింది.



కేజ్రీవాల్ ప్రధాన మంత్రి కావాలని నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్, కేజ్రీవాల్లు  వైట్హౌస్లో కలుసుకోవడం చూడాలన్నది నా కోరిక' అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న వీరప్పన్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న వర్మ ఆ సినిమాను మే 27న రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు.


 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top