ఆ వీడియోను రోజూ చూస్తా:రామ్ చరణ్

ఆ వీడియోను రోజూ చూస్తా:రామ్ చరణ్ - Sakshi


హైదరాబాద్:మగధీర సినిమా గుర్తుంది కదూ.. అందులో హీరో రామ్ చరణ్ చెప్పిన 'షేర్ ఖాన్' అనే డైలాగ్ అటు పెద్దల నుంచి పిన్నల వరకూ అందర్నీ ఆకర్షించింది. ఆ డైలాగ్ తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో.ఇప్పుడు అదే డైలాగ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఓ బాలుడు చెప్పిన ఆ లెంగ్తీ డైలాగ్ ను వీడియో తీసి నెట్ లో పోస్ట్ చేశారు. ఈ డైలాగ్ రామ్ చరణ్ ను సైతం విపరీతంగా ఆకట్టుకుందట.


 


'ఆ వీడియోను ప్రతీ రోజూ చూస్తా. నిజంగా ఆ కుర్రాడి టాలెంట్ ను అభినందించాలి.  చాలా అద్భుతంగా ఉంది. అతన్ని కలవాలనుకుంటున్నాను. ఆ యువకుడి ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నించండి' అని రామ్ చరణ్ ఫేస్ బుక్ స్నేహితులకు విజ్ఞప్తి చేశాడు.


 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top