రకుల్కు మరో క్రేజీ ఆఫర్

రకుల్కు మరో క్రేజీ ఆఫర్


ఈ జనరేషన్ హీరోయిన్లలో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న స్టార్ రకుల్ ప్రీత్ సింగ్. తనతో పాటు ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లందరూ అవకాశాల కోసం ఎదురుచూస్తుంటే  రకుల్ మాత్రం క్రేజీ ఆఫర్స్తో దూసుకుపోతోంది. టాలీవుడ్ టాప్ స్టార్స్తో వరుస సినిమాలు చేస్తున్న ఈ బ్యూటి ఇప్పుడు కోలీవుడ్ మీద దృష్టిపెట్టింది. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఈ భామ మరో ఇంట్రస్టింగ్ మూవీకి ఓకే చెప్పింది.



సింగం 3 సినిమాతో మరోసారి సూపర్ హిట్ కొట్టిన సూర్య, రొమాంటిక్ సినిమాలను తెరకెక్కించే సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ను హీరోయిన్గా ఫైనల్ చేశారు. ఈ రెండు సినిమాలతో కోలీవుడ్లో కూడా స్టార్ స్టేటస్ అందుకునేందుకు ప్లాన్ చేస్తోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top