సూపర్ స్టార్ ఇంటిముందు సంబరాలు

సూపర్ స్టార్ ఇంటిముందు సంబరాలు


చెన్నై: ఫిబ్రవరి 26.. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పెళ్లి రోజు. రజనీకాంత్ 36వ వివాహ వార్షికోత్సవాన్ని అభిమానులు ఘనంగా చేసుకున్నారు. ఆదివారం చెన్నైలోని రజనీ నివాసానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. ఆయన ఇంటి ముందు పోస్టర్లు ఏర్పాటు చేశారు. అభిమానులు రజనీ ఫొటో ఉన్న చొక్కాలు ధరించి, మరికొందరు ఆయన సినిమాల్లో వేషధారణతో వచ్చారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.



1981 ఫిబ్రవరి 26న రజనీకాంత్ తిరుపతిలో లతను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య ఉన్నారు. కాగా ఈ రోజున రజనీ ఇంట్లో ఉన్నారా లేదా అన్న విషయం తెలియరాలేదు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top