మహేష్ బాబుతో రాజమౌళి సినిమా!

మహేష్ బాబుతో రాజమౌళి సినిమా! - Sakshi


చెన్నై: ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా వస్తే ఎలా ఉంటుంది? అభిమానులకు పండుగే కదా! ఈ తీపి కబురు వినే అవకాశముంది. రాజమౌళి తర్వాతి చిత్రంలో మహేష్ బాబుతో ఉంటుందని టాక్. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బాహుబలితో్ బిజీగా ఉన్న రాజమౌళి.. ఈ చిత్రం రెండు భాగాలు విడుదలయ్యాక మహేష్ బాబుతో తర్వాతి చిత్రం తీయవచ్చని ఓ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.



'రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో కొన్నేళ్ల క్రితం ఓ సినిమా తీయాల్సివుంది. అయితే వివిధ కారణాల వల్ల ఈ ప్రాజెక్టు ఆలస్యమైంది. వచ్చే ఏడాది బాహుబలి రెండో పార్ట్ చిత్రం విడుదలయ్యాక.. సినిమా చేయాలని రాజమౌళి, మహేష్ బాబు భావిస్తున్నారు. ఈ లోగా మహేష్ బాబు.. శ్రీకాంత్ అడ్డాల బ్రహ్మోత్సవం, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మరో సినిమా పూర్తి చేస్తారు' అని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top