తండ్రిగా అక్షయ్ గర్వపడ్డవేళ..

తండ్రిగా అక్షయ్ గర్వపడ్డవేళ..


విశాఖపట్నం: అంతర్జాతీయ నౌకాదళాల ప్రదర్శన(ఐఎఫ్‌ఆర్)లో చోటు చేసుకున్న ఓ సంఘటన ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ను గర్వ పడేలా చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సరదాగా తన కుమారుడు ఆర్నవ్ చెవి పట్టుకొని మంచి బాలుడు అని అనడం తండ్రిగా గర్వపడే విషయమని నటుడు అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. మోదీ, ఆర్నవ్ చెవిని పట్టుకొన్న ఫోటోను తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. తనకు కూడా ఇది మరచిపోలేని సంఘటన అని, వేల పదాలకుండే విలువ నిజంగా ఈ దృశ్యానికుందని తల్లి ట్వింకిల్ కన్నా ట్విట్ చేశారు. ఐఎఫ్‌ఆర్-2016 బ్రాండ్ అంబాసిడర్‌గా అక్షయ్ కుమార్ ఉన్న విషయం తెలిసిందే.



మరోవైపు, ఐఎఫ్‌ఆర్-2016లో అత్యంత ముఖ్య ఘట్టం.. నౌకాదళ పాటవాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శనివారం సమీక్షించారు. త్రివిధ దళాల అధిపతి హోదాలో రాష్ట్రపతి ఈ సమీక్ష చేశారు. సంప్రదాయబద్ధమైన 21 తుపాకులతో గౌరవ వందనం స్వీకరించిన తరువాత రాష్ట్రపతి యుద్ధనౌక ఐఎన్‌ఎస్ సుమిత్రను అధిరోహించారు. అందులో పయనిస్తూ సముద్రజలాల్లో లంగరు వేసి ఉన్న 100 యుద్ధ నౌకల సామర్థ్యాన్ని సమీక్షించారు. వాటిలో భారత యుద్ధ నౌకలు 71 కాగా మిగిలినవి విదేశీ యుద్ధ నౌక లు. ఐఎన్‌ఎస్ సుమిత్ర తమ చెంతకు రాగానే యుద్ధ నౌకల్లో ఉన్న నౌకాదళాల అధికారులు, సిబ్బంది రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top