నరోత్తముడు


 ‘బాహుబలి’ విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్త్తున్న ప్రేక్షకులకు ఊరటగా దర్శకుడు రాజమౌళి విడుదల చేసిన రెండో పోస్టర్ ఇది. ఈ పోస్టర్ చూస్తుంటే ఏమనిపిస్తోంది? కండలు తిరిగిన ఆరడుగుల ఆజానుబాహుడైన ప్రభాస్ ఓ భారీ శివలింగాన్ని మోసుకుంటూ వస్తుంటే చాలా ఆసక్తికరంగా ఉంది కదూ! ఇది ఆ సినిమాలో ప్రభాస్ పోషిస్తున్న శివుడు పాత్ర గెటప్. దీనికి రాజమౌళి ఇచ్చిన వ్యాఖ్య ఏంటో తెలుసా?  ‘‘ఆ గంగను మోసిన జంగమదేవుని... నెత్తిన మోసినదెవడు! నరనరమున సత్తువ ఉరకలు వేసిన నరోత్తముడు ఎవడు....’’ అని! ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.





ఆ గంగను మోసిన జంగమదేవుని నెత్తిన మోసినదెవడు!


నరనరమున సత్తువ ఉరకలు వేసిన నరోత్తముడు ఎవడు!



 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top