పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో అపశ్రుతి

పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో అపశ్రుతి - Sakshi


చినగంజాం : అభిమానం నిండు ప్రాణాలు కోల్పోయేలా చేసింది.  హీరో పవన్ కళ్యాణ్ జన్మిదిన వేడుకల్లో మంగళవారం అపశ్రుతి చోటుచేసుకుంది.  ప్రకాశం జిల్లా చినగంజాంలో పవన్ బర్త్డే సందర్భంగా ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్తో గోనినేని రమేష్ అనే అభిమాని మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా పవన్ కళ్యాణ్ నేడు 43వ పుట్టినరోజు  సందర్భంగా అతని అభిమానులు వేడుకలు జరుపుకుంటున్నారు.



 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top