పవన్ 25.. లుక్ ఇదేనా..?

పవన్ 25.. లుక్ ఇదేనా..? - Sakshi


కాటమరాయుడు సినిమాతో నిరాశపరిచిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అత్తరింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ అందించిన కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే సినిమా మొదలై చాలా కాలం అవుతున్నా.. ఇంత వరకు ఒక్క అఫీషియల్ అప్ డేట్ కూడా ఇవ్వలేదు చిత్రయూనిట్.



సినిమా టైటిల్ విషయంలో రకరకాల వార్తలు వినిపిస్తున్నా.. చిత్రయూనిట్ మాత్రం అఫీషియల్ టైటిల్ ను ప్రకటించలేదు. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యూల్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో పవన్ లుక్ ఎలా ఉండబోతోందో తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా పవన్ తాజా చిత్రం లుక్ ఇదే అంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే ఫోటోలో పవన్ గడ్డంతో కనిపిస్తుండటంతో ఇదే త్రివిక్రమ్ సినిమా లుక్కేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.



కాటమరాయుడు సినిమా తరువాత పవన్ ఎప్పుడు గడ్డంతో కనిపించలేదు. అందుకే ఇది గతంలో ఎప్పుడో దిగిన ఫోటో అయి ఉంటుందని భావిస్తున్నారు. కానీ గతంలో ఎప్పుడు కనిపించని ఫోటో కావటంతో ఇది కొత్త సినిమా ఫోటోనే అయి ఉంటుందన్న భావన కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వాదనల్లో ఏది నిజమో తెలియాలంటే అఫీషియల్ ఫస్ట్ లుక్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top