సుచీలీక్స్‌ మళ్లీ మొదలైంది

సుచీలీక్స్‌ మళ్లీ మొదలైంది


సుచీలీక్స్‌ అంటేనే కోలీవుడ్‌ తారలకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఎవరి పర్సనల్‌ జీవితాల్లో సుచీలీక్స్‌ ఎప్పుడు బాంబ్‌ పేల్చుతుందోనని భయాందోళనలకు గురవుతున్నారు. ఇది రెండు నెలల క్రితం మాట. అయితే ఆ మాటలు నటి అమలాపాల్‌కు వర్తించవు. ఎందుకంటే తన గురించిన సుచీలీక్స్‌ కోసం ఆ సంచలన నటి ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు అమలాపాల్‌ ఇటీవలే చెప్పింది. ఇంతకీ సుచీలీక్స్‌ అంటే ఇప్పుడు ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం ఉండదనుకుంటా.



 గాయని సుచిత్ర ప్రముఖ నటీనటుల రాసలీలలను వీడియో రూపంలో తన ట్విట్టర్‌ ద్వారా బహిరంగపరచడమే. ఇప్పటికే చాలా మంది ప్రముఖ నటీనటుల ఆంతరంగిక విషయాలను బయట పెట్టి కలకలం సృష్టించిన గాయని సుచిత్ర తన ట్విట్టర్‌ హ్యాక్‌ చేశారంటూ కొంత కాలం సైలెంట్‌గా ఉంది. తాజాగా మళ్లీ తన అలవాటైన లీక్స్‌ విడియోలను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయడం మొదలెట్టింది. ఈ సారి సుచీలీక్స్‌ కన్ను యువ నటి నివేదపేతురాజ్‌పై పడింది. ఒరునాళ్‌ కూత్తు చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన కేరళాకుట్టి నివేద.



ప్రస్తుతం జయంరవితో టిక్‌ టిక్‌ టిక్‌ చిత్రంలోనూ, ఉదయనిధిస్టాలిన్‌తో పొదువాగ ఎన్‌ మనసుతంగం చిత్రాల్లో నటిస్తోంది. ఈ అమ్మడి రాసలీలల వీడియోను సుచిత్ర ట్విట్టర్‌ ద్వారా విడుదలై ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. మరి ఈ వీడియోపై గాయని సుచిత్ర షరామామూలుగానే తన ట్విట్టర్‌ హ్యాక్‌ అయ్యిందంటుందో, తనకు ఎలాంటి సంబంధం లేదని ఎస్కేప్‌ అయ్యే ప్రయత్నం చేస్తుందో చూడాలి. ఇక నటి నివేదపేతురాజ్‌ రియాక్షన్‌ ఎలా ఉంటుందో కూడా వేచి చూడాలి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top