పవన్ ఫోటోకో ముద్దు!

పవన్ ఫోటోకో ముద్దు! - Sakshi


హైదరాబాద్: అభిమానులు లేకుంటే ఏ హీరో లేడని నితిన్ అన్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా కథానాయకులకు అండగా నిలిచేది అభిమానులేనని పేర్కొన్నారు. తాను హీరోగా నటించిన 'చిన్నదాన నీ కోసం' ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం సాయంత్రం జరిగింది.



ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ... కాలు బెనకడంతో ఈ సినిమాలో ఓ పాటకు డాన్స్ సరిగా చేయలేకపోయానని తెలిపారు. ఇందుకు ఫ్యాన్స్ తనను క్షమించాలని వేడుకున్నారు. అభిమానులు చూపిస్తున్న ప్రేమతోనే ఇంత కష్టపడుతున్నానని చెప్పారు. తనపై చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. తామంతా పవన్ కళ్యాణ్ అభిమానులమని పునరుద్ఘాటించారు.



ఈ సందర్భంగా ఓ అభిమాని పవన్ కళ్యాన్, నితిన్ చిత్రపటాన్ని ఆయనకు బహూకరించారు. పవన్ కళ్యాణ్ చిత్రాన్ని ముద్దాడి నితిన్ తన అభిమానాన్ని సభాముఖంగా చాటారు. పవన్ ఫోటో ఎక్కడ పెట్టుకుంటారని అడగ్గా... ఆయన తన గుండెల్లో ఉన్నారంటూ నితిన్ జవాబిచ్చారు. 



'చిన్నదాన నీ కోసం' సినిమా అందరికీ నచ్చుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో హీరోయిన్ మిస్తీ, దర్శకుడు కరుణాకరన్, నిర్మాతలు సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ తదితరులు పాల్గొన్నారు. చివర్లో చిన్నదాన నీ కోసం పాటకు నితిన్, మిస్తీ స్టెప్పులు వేసి అభిమానులను అలరించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top