పవన్, నితిన్ల సినిమా మొదలైంది..!

పవన్, నితిన్ల సినిమా మొదలైంది..! - Sakshi


హీరోగా, రాజకీయనాయకుడిగా ఫుల్ బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్మాతగానూ మారిన సంగతి తెలిసిందే. తన వీరాభిమాని నితిన్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్తో కలిసి పవన్ ఒక సినిమా నిర్మిస్తున్నాడు. చాలా రోజుల క్రితమే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా, నితిన్ లై షూటింగ్లో బిజీగా ఉండటంతో సెట్స్ మీదకు రాలేదు. లై సినిమా షూటింగ్ పూర్తి కావంటతో నితిన్ కొత్త సినిమా సోమవారం (24-07-2017) నాడు సెట్స్ మీదకు వచ్చింది.



హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లై ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. అదే సమయంలో తన కొత్త సినిమా షూటింగ్లో బిజీ కానున్నాడు నితిన్. రౌడీ ఫెలో ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి షెడ్యూల్ 50 రోజుల పాటు జరగనుంది. ఆ తరువాత అమెరికాలో మరో భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top