మళ్లీ పూరీతో..!

మళ్లీ పూరీతో..!


నితిన్‌కి పదమూడేళ్లు... ఏంటీ ఆశ్చర్యంగా ఉందా? నటుడిగా నితిన్ వయసిది. ఈ పదమూడేళ్లల్లో తను చేసినది దాదాపు 20 చిత్రాలు. ముందు లవర్ బోయ్, ఆ తర్వాత మంచి మాస్ హీరో, ఇప్పుడు మంచి కమర్షియల్ హీరో.. ఇలా నటుడిగా వయసు పెరిగేకొద్దీ... నితిన్ నటనలో కూడా పరిణతి కనపడుతూ వస్తోంది. ఇప్పటివరకూ కథానాయకునిగానే కొనసాగిన నితిన్ ఈ ఏడాది నిర్మాతగా మారిన విషయం తెలిసిందే.

 

 అఖిల్ అక్కినేని పరిచయ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్నేహితుడు హీరోగా నటిస్తున్న ఈ తొలి చిత్రం అద్భుతంగా ఉండటానికి ఏమేం కావాలో అవన్నీ చేస్తున్నారు నితిన్. దీంతో పాటు మరో రెండు చిత్రాలు కూడా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో హీరోగా నటించనున్నారు. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై రూపొందనున్న ఈ చిత్రం మే నెలలో ఆరంభం కానుంది.



 హీరోగా, నిర్మాతగా బిజీగా ఉన్న నితిన్ పుట్టినరోజు నేడు.  ఈ సందర్భంగా కొత్త నిర్ణయాలు తీసుకున్నా తీసుకోకపోయినా.. ఎప్పుడూ నితిన్ ఎజెండా ఒక్కటే.. అదేంటంటే.. ఏ పాత్ర చేసినా, అందుకు పూర్తి న్యాయం చేయాలి, నటుడిగా సవాల్ అనిపించే పాత్రలు చేయాలి. అవసరమైతే ఆ పాత్ర కోసం శరీరాకృతి, శారీరక భాషను పూర్తిగా మార్చుకోవాలి.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top