మా వేడుక కలర్‌ఫుల్‌గా ఉంటుంది!

మా వేడుక కలర్‌ఫుల్‌గా ఉంటుంది!


‘‘టైటిల్‌కి తగ్గట్టుగానే ఈ సినిమా ఓ ఫెస్టివల్‌లా ఉంటుంది. నేను ఎంజాయ్‌ చేశాను. ప్రేక్షకులు కూడా ఎంజాయ్‌ చేస్తారనే నమ్మకం ఉంది’’ అని నాగచైతన్య అన్నారు. కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ జంటగా నాగార్జున నిర్మించిన చిత్రం ‘రారండోయ్‌... వేడుక చూద్దాం’. నేడు ఈ చిత్రం విడుదల సందర్భంగా నాగచైతన్య పత్రికలవారితో పంచుకున్న విశేషాలు...



వేడుక చూద్దామని పిలిస్తే ప్రేక్షకులు ఫెస్టివల్‌లాంటి సినిమా అని వచ్చేస్తారు.. అలానే ఉంటుందా?

కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ‘నీ లవ్‌స్టోరీలు అన్నీ ఒక రేంజ్‌లో ఉంటాయి. కానీ నువ్వు నెక్స్‌›్టæలెవల్‌కి వెళ్లాలంటే ఆ లవ్‌స్టోరీలో ఇంకా ఏదో ఉండాలి. నన్ను నమ్మి ఈ సినిమా చెయ్యి’ అని నాన్న అన్నారు.



ఈ సినిమా కాన్సెప్ట్‌ నాన్నగారికి బాగా నచ్చింది. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా చూసిన తర్వాత నాకు డైరెక్టర్‌ కల్యాణ్‌ కృష్ణ టాలెంట్‌ మీద నమ్మకం పెరిగింది. నాన్న మాటని నమ్మి చేశాను. సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. నాన్నగారైతే సినిమాను చాలాసార్లు చుశారు. అవుట్‌పుట్‌ బాగా రావడంతో ఆయనతో పాటు యూనిట్‌ అంతా మూవీ సూపర్‌ సక్సెస్‌ అవుతుందని కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ సినిమా సక్సెస్‌ అయ్యి, నా కెరీర్‌కి హెల్ప్‌ అవుతుంది.



నాగార్జునగారు అంతగా చెప్పారంటే మీ క్యారెక్టర్‌ డిఫరెంట్‌గా ఉండి ఉంటుందేమో?

అవును. ఫస్ట్‌ టైమ్‌ నా కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటకు వచ్చి, ఈ సినిమా చేశాను. ప్రేక్షకులు నన్ను ఇంత ఎనర్జిటిక్‌ రోల్‌లో యాక్సెప్ట్‌ చేస్తారా? అనే డౌట్‌ ఉండేది. ‘ఇలాంటి క్యారెక్టర్‌ చేస్తే, నీ బాడీ లాంగ్వేజ్‌ సెట్‌ అవుతుంది’ అని నాన్న అన్నారు. కల్యాణ్‌కి కమర్షియల్‌ పల్స్‌ బాగా తెలుసు. తను కూడా ప్రోత్సహించాడు. సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్‌ బాగుంటాయి. ఇప్పటివరకు నేను చేసిన లవ్‌ స్టోరీస్‌ హీరో, హీరోయిన్‌ల మధ్య లవ్‌ గురించే ఉంటాయి.


కానీ, ఈ సినిమాలో ఓ తండ్రికి, ఓ కొడుక్కి మధ్య ఉన్న ప్రేమ, ఎమోషన్స్‌ కూడా ఉంటాయి. అంతర్గత సమస్యలతో సతమతమవుతున్న రెండు కుటుంబాల మధ్య ఎలాంటి సంఘర్షణ ఉంటుంది? ఇంట్లో పెద్దవాళ్లు ఒక ఎమోషనల్‌ బాండేజ్‌కు ఎలా కనెక్ట్‌ అయి ఉంటారు? అనే విషయాలతో హోల్‌సమ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లా ఉంటుంది.



‘ప్రేమమ్‌’లో ఆర్టిస్టుగా మీరు ఇంకా డెవలప్‌ అయినట్లనిపించింది. మరి ఈ సినిమాలో?

సినిమా స్టార్ట్‌ చేసినప్పుడు ఈ పాత్రలో నేను సెట్‌ అవుతానా లేదా అన్న భయం ఉండేది. అయితే నాన్నగారు, డైరెక్టర్‌ కల్యాణ్‌కృష్ణ నన్ను ప్రోత్సహించారు. నేను చేసే రోల్‌ ప్రేక్షకులకు కనెక్ట్‌ అవుతుందన్న నమ్మకాన్ని నాలో నింపారు. అయితే ఒకసారి స్క్రిప్ట్‌ విన్న తర్వాత ఇంట్రెస్ట్‌ పెరిగింది. షూటింగ్‌ సరదాగా గడిచింది. నా యాక్టింగ్‌ స్కిల్స్‌ను పెంచే విధంగా కల్యాణ్‌ కృష్ణ సినిమాను తెరకెక్కించాడు.



రకుల్‌ గురించి?

భ్రమరాంబగా రకుల్‌ నటన సూపర్బ్‌. మా ఇద్దరి కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. ఈ చిత్రంలో కొత్త రకుల్‌ని చూస్తారు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో బంగార్రాజు క్యారెక్టర్‌ ఎలా గుర్తుండిపోతుందో అలా ఈ మూవీలో భ్రమరాంబ క్యారెక్టర్‌ ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది.



దేవిశ్రీ ప్రసాద్‌ మా బ్యానర్‌లో మంచి హిట్‌ సాంగ్స్‌ అందించాడు. ఈ సినిమా కథ విని, దేవి ఇంప్రెస్‌ అయ్యాడు. రీ–రికార్డింగ్‌ ఎలా ఇస్తాడో ముందే చెప్పి నన్ను యాక్టింగ్‌కి రెడీ అవ్వమన్నాడు. యాక్టర్‌గా నేను ఇంప్రూవ్‌ అవ్వడానికి దేవిశ్రీ సలహాలు ఉపయోగపడ్డాయి.



ఇందులో జగపతిబాబు చేసిన పాత్రను మీ నాన్నగారిని చేయమని అడిగారట..?

అవును. కానీ, నాన్న చేయనన్నారు (నవ్వుతూ). అయితే ఈ పాత్ర (తండ్రి పాత్ర)కు మా నాన్నగారికన్నా జగపతిబాబుగారే కరెక్ట్‌. ఆయన కాంబినేషన్‌ నాకు చాలా బాగా కుదిరింది.



ప్రస్తుతం చేస్తున్న సినిమాలు?

సాయి కొర్రపాటి బ్యానర్‌లో ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్‌లో ఒక థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌ సినిమా చేస్తున్నాను. చందూ మొండేటి చెప్పిన కథ నచ్చింది. అది కూడా చేయాలనుకుంటున్నా. గౌతమ్‌మీనన్‌ నాలుగు భాషల్లో తెరకెక్కించబోయే సినిమాలో తెలుగు వెర్షన్‌లో నేను హీరోగా యాక్ట్‌ చేయబోతున్నాను.



ఫుల్‌ క్లారిటీ!

ప్రస్తుతం ‘హ్యాపీ స్పేస్‌’లో ఉన్నాను. అక్టోబర్‌లో సమంతతో పెళ్లి. పర్సనల్‌ లైఫ్‌ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నాను. ప్రొఫెషనల్‌గా మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను. ఇంతకు మించి నేను పెద్దగా ఏం ఆలోచించడంలేదు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top