ముక్తిభవన్‌ : ఈ సినిమా చూశారా?

ముక్తిభవన్‌ : ఈ సినిమా చూశారా?


77 ఏళ్ల ఒక తండ్రికి ఒక రోజు రాత్రి వింత కల వస్తుంది. తన చివరి రోజులు దగ్గర పడ్డాయని ఇక ముక్తి కోసం కాశీకి వెళ్లి హాయిగా అక్కడ ఊపిరి వదలాలని ఆ కలతో అతడు నిశ్చయించుకుంటాడు. అతడికి ఉన్నదల్లా ఒక్కడే కొడుకు. తండ్రి కోరిక విని అతడు హతాశుడవుతాడు. ఎన్ని విధాలా బతిమిలాడినా తండ్రి వినడు. ఇక విధి లేక తండ్రిని కాశీలో వదిలి రావడానికి కొడుకు తండ్రిని తీసుకుని బయలుదేరుతాడు. తండ్రి అక్కడ ఉండే ‘ముక్తిభవన్‌’లో చేరుతాడు. ముక్తిభవన్‌ అంటే సులభభాషలో అర్థం ‘మరణ సత్రం’. ఆ సత్రంలో తండ్రితో పాటు దిగిన కొడుకు చివరకు ఏం తెలుసుకున్నాడు అనేది కథ.



ఏప్రిల్‌ 7న చాలా తక్కువ సెంటర్లలో విడుదలైన ఈ సినిమా పండితులను పత్రికలను విశేషంగా ఆకట్టుకుంది. ప్రశంసలు కొనసాగుతున్నాయి. తండ్రిగా లలిత్‌ బెహల్, కొడుకుగా ఆదిల్‌ హుసేన్‌ నటించిన ఈ సినిమాకి దర్శకుడు శుభాశీష్‌ భుటియాని. కాశీ జీవనాన్ని, చివరి రోజుల్లో అక్కడ ముక్తిని పొందాలని చేరుకునే వృద్ధుల భావోద్వేగాలనూ ఈ సినిమా సున్నితంగా పట్టుకుందనే ప్రశంసలు వస్తున్నాయి. వీలైతే ఈ సినిమాను వెతుకులాడండి. చూడండి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top