'మీలో ఎవరు కోటీశ్వరుడు' మూవీ రివ్యూ

'మీలో ఎవరు కోటీశ్వరుడు' మూవీ రివ్యూ


టైటిల్ : మీలో ఎవరు కోటీశ్వరుడు

జానర్ : సెటైరికల్ కామెడీ

తారాగణం : పృథ్వీ, సలోని, నవీన్ చంద్ర, శృతిసోథి, పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, రఘుబాబు

సంగీతం : డిజె వసంత్

దర్శకత్వం : ఇ. సత్తిబాబు

నిర్మాత : కె కె రాధామోహన్



కామెడీ సినిమాల స్పెషలిస్ట్గా పేరు తెచ్చుకున్న ఇ సత్తిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సెటైరికల్ కామెడీ మీలో ఎవరు కోటీశ్వరుడు. తొలిసారిగా కామెడీ స్టార్ 30 ఇయర్స్ పృథ్వీ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాలో నవీన్ చంద్ర, శృతిసోథీ, సలోనిలు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. తొలిసారి హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న పృథ్వీకి మీలో ఎవరు కోటీశ్వరుడు సక్సెస్ అందించిందా..? సత్తిబాబు, తన కామెడీ ఫార్ములాతో మరోసారి ఆకట్టుకున్నాడా..?



కథ :

ప్రశాంత్(నవీన్ చంద్ర) ఓ సిన్సియర్ స్టూడెంట్. కాలేజ్ టాపర్ అయిన ఈ కుర్రాడికి ఓ రోజు అర్థరాత్రి ఫుల్గా తాగేసి.. కారును డివైడర్కు గుద్దేసిన ప్రియా(శృతిసోథీ) కనిపిస్తుంది. ప్రియా పరిస్థితిని చూసి తానే వెళ్లి ఇంట్లో దిగబెట్టి వస్తాడు ప్రశాంత్. ఓ అమ్మాయి అలాంటి పరిస్థితుల్లో కనిపించినా.. ఏ మాత్రం అడ్వాంటేజ్ తీసుకోకుండా జాగ్రత్తగా ఇంటికి తీసుకువచ్చిన ప్రశాంత్తో ప్రేమలో పడుతుంది ప్రియా. ముందు కాస్త బెట్టు చేసినా ఫైనల్గా ప్రశాంత్ కూడా ప్రేమలో పడతాడు. తమ ప్రేమకు ప్రశాంత్ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నా.., మల్టీ మిలియనీర్ అయిన ప్రియా త్రండి మాత్రం ఏబీఆర్(మురళీ శర్మ) అంగీకరించడు. తన ఆస్తి కోసమే ప్రియను ప్రేమలో పడేశావని ప్రశాంత్ని అవమానిస్తాడు.



ప్రశాంత్ మాత్రం డబ్బుతో ఆనందం రాదని, కావాలంటే మీరు ఒక్కసారి ఏదైన బిజినెస్ చేసి నష్టపోయి చూడండి తరువాత మీకు ఆనందం విలువ ఏంటో తెలుస్తుంది అని చెప్పి వెళ్లిపోతాడు. అప్పటి వరకు ఏ బిజినెస్లోనూ నష్టపోని ఏబీఆర్, నష్టాలు తెచ్చిపెట్టే బిజినెస్ ఐడియా ఇవ్వమని పేపర్ ప్రకటన ఇస్తాడు. అలాంటి ఐడియా ఇచ్చిన వారికి కోటి రూపాయల బహుమతి ప్రకటిస్తాడు. స్టార్ హీరోలతో సినిమాలు తీసి నష్టపోయిన నిర్మాత తాతారావు(పోసాని కృష్ణమురళి) ఆ ప్రకటన చూసి ఏబీఆర్ను కలుస్తాడు. తాను ఓ ఫ్లాప్ సినిమా తీసి పెడతానని దాంతో భారీగా నష్టం వస్తుందని ప్రామిస్ చేస్తాడు.



జీవితంలో ఒక్క హిట్ కూడా ఇవ్వని దర్శకుడు రోల్డ్ గోల్డ్ రమేష్ (రఘుబాబు) డైరెక్టర్గా, 30 ఏళ్లుగా జూనియర్ ఆర్టిస్ట్గానే మిగిలిపోయిన వీరబాబు( పృథ్వీ) హీరోగా సలోని హీరోయిన్గా తమలపాకు పేరుతో సినిమా ప్లాన్ చేస్తాడు. చివరకు రోల్డ్ గోల్డ్ రమేష్ తెరకెక్కించిన తమలపాకు సినిమా రిలీజ్ అయ్యిందా..? అనుకున్నట్టుగా ఏబీఆర్ నష్టపోయాడా..? ప్రశాంత్, ప్రియా ప్రేమకథ ఎలా ముగిసింది..? అన్నదే మిగతా కథ.



నటీనటులు :

పేరుకు నవీన్ చంద్ర హీరో అయినా.. సినిమా అంతా పృథ్వీనే హీరోగా కనిపిస్తాడు. తనకు బాగా అలవాటైన పేరడీ సీన్స్తో ఆకట్టుకున్నాడు. కామెడీ టైమింగ్తో పాటు పంచ్ డైలాగ్స్తోనూ అలరించాడు. సినిమాలు తీసి నష్టపోయిన నిర్మాత తాతారావు పాత్రకు పోసాని కృష్ణమురళి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. రఘుబాబు, పోసాని కాంబినేషన్లో వచ్చే కామెడీ సీన్స్ కితకితలు పెడతాయి. ఇతర పాత్రల్లో మురళీ శర్మ, జయప్రకాష్ రెడ్డి, ప్రభాస్ శ్రీను, ధనరాజ్లు తమ పరిథి మేరకు ఆకట్టుకున్నారు.



సాంకేతిక నిపుణులు :

రెండు విభిన్న కథలను ఓకె కథలో చూపించే ప్రయత్నం చేసిన దర్శకుడు ఇ సత్తిబాబు ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా రెండు కథలను కనెక్ట్ చేసిన తీరు కూడా బాగుంది. ఇప్పటికే తనకు కామెడీ సినిమాలు తెరకెక్కించటంలో తిరుగులేదని ప్రూవ్ చేసుకున్న సత్తిబాబు, ఈ సినిమాతో పేరడీ కామెడీని కూడా బాగానే డీల్ చేశాడు. సినీ రంగం మీదే సెటైరికల్గా తెరకెక్కించిన కామెడీ సీన్స్ సినిమాకే హైలెట్గా నిలిచాయి. డిసె వసంత్ సంగీతం బాగుంది. ఎక్కువగా పాత సినిమా పాటలనే వాడుకున్నా.. నేపథ్య సంగీతంతో తన మార్క్ చూపించాడు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.



ప్లస్ పాయింట్స్ :

కామెడీ

పృథ్వీ క్యారెక్టర్



మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్



ఓవరాల్గా మీలో ఎవరు కోటీశ్వరుడు కాస్త సాగదీసినట్టుగా అనిపించినా.. కడుపుబ్బా నవ్వించే సెటైరికల్ కామెడీ



- సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top