పెళ్లి బాజా...

పెళ్లి బాజా... - Sakshi


మంచువారి సొట్టబుగ్గల సిన్నోడు మనోజ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడండోయ్. ఈ విషయం మనోజే స్వయంగా ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. కాబోయే జీవిత భాగస్వామి ప్రణతి ఫొటోకు జతగా ‘మై లైఫ్ ఈజ్ లవ్ ప్రణతి’ అంటూ ఆమెను పరిచయం చేశాడు. ఈ నెల 4న పార్క్ హయత్‌లో నిశ్చితార్థం జరగనుందని  ప్రకటించాడు.



మనోడి పోస్ట్‌కు ఫ్యాన్స్ నుంచి ఫుల్ రెస్పాన్స్ వచ్చేసింది. కొత్త జంటకు నటి ప్రియమణి శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘షి ఈజ్ ప్రెట్టీ’ అని ట్వీటింది. అభినందనలు తెలిపిన మిత్రులు, అభిమానులకు మనోజ్ ధన్యవాదాలు చెబుతూ  రీట్వీటాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top